విధాత:తాడిపత్రి పట్టణ సమీపంలో అర్జాస్ స్టీల్స్ వద్ద ఏర్పాటు చేస్తున్న 500 ఆక్సిజన్ పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జెర్మన్ హ్యాంగర్ పద్ధతిలో ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నామని, యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు.. బాధితులకు ఆక్సిజన్ అందించేందుకు అవసరమయ్యే 'ఆక్సిజన్ పైప్ లైన్' మరియు 'సర్జ్ ట్యాంకు' నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని కలెక్టర్ వివరించారు. సర్జ్ ట్యాంకుతో నిరంతర […]
విధాత:తాడిపత్రి పట్టణ సమీపంలో అర్జాస్ స్టీల్స్ వద్ద ఏర్పాటు చేస్తున్న 500 ఆక్సిజన్ పడకల ఆసుపత్రి నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జెర్మన్ హ్యాంగర్ పద్ధతిలో ఆసుపత్రి నిర్మాణం చేపడుతున్నామని, యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు.. బాధితులకు ఆక్సిజన్ అందించేందుకు అవసరమయ్యే ‘ఆక్సిజన్ పైప్ లైన్’ మరియు ‘సర్జ్ ట్యాంకు’ నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని కలెక్టర్ వివరించారు.
సర్జ్ ట్యాంకుతో నిరంతర ఆక్సిజన్ సరఫరా
తాత్కాలిక ఆసుపత్రిలో ఏర్పాటు చేయనున్న సర్జ్ ట్యాంకు నిరంతర ఆక్సిజన్ సరఫరాలో కీలక పాత్ర పోషించనుంద ని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. ఆస్పత్రులోని పడకలకు అర్జాస్ స్టీల్ ఫ్యాక్టరీలోని గ్యాసియస్ ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటు ద్వారా డైరెక్టుగా ఆక్సిజన్ అందించేందుకు 700 మీటర్ల పైప్ నిర్మాణం చేపట్టడం జరిగిందని, అయితే ఎప్పుడైనా ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంటులో సమస్యలు ఎదురైతే సర్జ్ ట్యాంకులో ఉన్న నిల్వ చేసుకున్న లిక్విడ్ ఆక్సిజన్ ద్వారా ఆక్సిజన్ అందించడం కోసం సర్జ్ ట్యాంక్ 450 కేజీల బరువు తో 1 మీటర్ వ్యాసం,1.50 మీటర్ పొడవుతో ఢిల్లీలోని నోయి డా ప్రాంతం గౌతమ బుద్ధ నగర్ లో సిద్ధమైంద ని కలెక్టర్ తెలిపారు.
మామూలుగా అయితే సర్జ్ ట్యాంకు అందుబాటులోకి తెచ్చేందుకు ఒకటి నుంచి రెండు నెలల సమయం పడుతుందని, అయితే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తయారీదారులతో రోజుల వ్యవధిలోనే తయారు చేయించి రోడ్డు మార్గం ద్వారా జిల్లాకు తెప్పిస్తున్నామని . సర్జ్ ట్యాంకు వచ్చేలోపే ఆక్సిజన్ పైప్ లైన్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేయనున్నామని కలెక్టర్ తెలిపారు.
జెర్మన్ హ్యాంగర్ పద్ధతిలో ఆసుపత్రి నిర్మాణం
మామూలుగా ఒక ఆసుపత్రి నిర్మాణానికి ఏళ్లకు ఏళ్లు కూడా సమయం పడుతుంది. కానీ కరోనాతో పోరాడేందుకు అంత సమయం లేదు. అందుకే వేగంగా, దృఢంగా ఉంటూ అన్ని కాలాల్లోనూ తట్టుకుని నిలబడే విధంగా జెర్మన్ హ్యాంగర్ పద్ధతిలో ఆసుపత్రి నిర్మాణం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.
డాక్టర్లు, నర్సుల నియామకం
ఆసుపత్రి అంటే కేవలం భవనం మాత్రమే కాదు. ఐదు వందల మందికి వైద్యం అందించడానికి కావాల్సిన డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య సిబ్బంది.. వీళ్లంతా కలిస్తేనే ఆసుపత్రి అవుతుంది. మూడు షిఫ్టుల్లో అంతమందికి వైద్యం అందించడానికి డాక్టర్లే 150 మంది అవసరం అవుతారని ఒక అంచనా. డాక్టర్లు, వైద్య సిబ్బంది, కరోనా రోగులు, వారి బంధువులు ఇలా అందరినీ కలుపుకుంటే 1500 మందికి పైగా వ్యక్తులు నిరంతరం ఆసుపత్రిలో ఉంటారు. డాక్టర్లు, నర్సుల నియామకానికి చర్యలు తీసుకుంటున్నామని, వారికి భోజన వసతి, నీటి వసతి, ఇతర వసతులను కూడా కల్పించడం జరుగుతోందన్నారు.
నీటి వసతి కోసం JCNR 1000 mm line నుండి ఆసుపత్రి వద్దకు ఒకటిన్నర కిలో మీటర్ల పైప్ లైన్ ద్వారా నీరు అందించనున్నామన్నారు. ప్రస్తుతం ఒక కిలో మీటర్ పై ప్ లైన్ నిర్మాణం పూర్తయిందనీ, . దీంతో పాటు అదనంగా ఆస్పత్రికి నీటి వసతి అందించేందుకు ఇప్పటికిప్పుడు లక్ష లీటర్ల సామర్థ్యంతో నీటి ట్యాంకును నిర్మించడం జరుగుతోందని కలెక్టర్ తెలిపారు.నీటి ట్యాంక్ ఎర్త్ వర్క్ పనులు పూర్తయ్యాయ ని, మరిన్ని అవసరాలకు బోరు బావి ద్వారా నీరు అందించేందుకు మరో 300 మీటర్ల పైప్ లైన్ నిర్మిస్తున్నామన్నారు. ఇంత పెద్ద ఆసుపత్రికి విద్యుత్ సరఫరా కోసం 1000 కెవి సామర్థ్యము కలిగిన హెచ్ టీ సర్వీసు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రేపటి కల్లా ఈ పని పూర్తి కానుంన్నారు..ఆస్పత్రి వద్ద 60 తాత్కాలిక టాయిలెట్లకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు
టూరిజం శాఖ ద్వారా రోగులకు, వైద్య సిబ్బందికి నాణ్యమైన భోజనం అందించే ఏర్పాటు చేస్తున్నామని, ఆసుపత్రిలో రోగులకు అవసరమైన మందులపై డీఎంహెచ్ఓ ను, డ్రగ్స్ శాఖలు అంచనాలు సిద్ధం చేసాయనీ, ఔషధాల లోటు ఉండకుండ చర్యలు తీసుకుం టున్నామన్నారు. కడపకు వెళ్లే జాతీయ రహదారి నుంచి ఆసుపత్రికి చేరుకునేవారికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు 600 మీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టామని, ఆస్పత్రిలో పని చేసే వైద్య సిబ్బందికి రీఫ్రెష్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతోందనీ, ఆస్పత్రి పరిసరాలు ఆహ్లాదంగా ఉండేందుకు పచ్చదనం ఏర్పాటు చేయాలని మునిసిపల్ అధికారులను ఆదేశించామని కలెక్టర్ తెలిపారు.
ఇది పేరుకు మాత్రమే తాత్కాలిక ఆసుపత్రి కానీ నిజానికి ఏ శాశ్వత ఆసుపత్రికి తీసిపోని విధంగా నిర్మించడం జరుగుతోంద ని కలెక్టర్ అభివర్ణించారు.