విధాత: అనంతపురం సూపర్ స్పెషాలిటీ, జిల్లా సర్వజన ఆసుపత్రి, కేన్సర్ ఆసుపత్రిలకు సరఫరా కావాల్సిన ఆక్సిజన్ నిల్వల ట్యాంకర్ ను కర్ణాటక రాష్ట్రం తోరణగల్లు జిందాల్ ఫ్యాక్టరీ నుంచి పోలీసులు ఎస్కార్ట్ తో ఈరోజు ఉదయం అనంతపురంకు తీసుకొచ్చారు. మార్గమధ్యంలో ఎలాంటి అంతరాయం కల్గకుండా, ఆలస్యం కాకుండా పోలీసుల సహకారం అందించారు. జి.పి.ఎస్ ట్రాకింగ్ సిస్టంతో సంబంధాలు తెగిపోకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఎస్కార్ట్ తో ఆక్సిజన్ ట్యాంకర్ ను జిల్లా సర్వజన ఆసుపత్రి, […]
విధాత: అనంతపురం సూపర్ స్పెషాలిటీ, జిల్లా సర్వజన ఆసుపత్రి, కేన్సర్ ఆసుపత్రిలకు సరఫరా కావాల్సిన ఆక్సిజన్ నిల్వల ట్యాంకర్ ను కర్ణాటక రాష్ట్రం తోరణగల్లు జిందాల్ ఫ్యాక్టరీ నుంచి పోలీసులు ఎస్కార్ట్ తో ఈరోజు ఉదయం అనంతపురంకు తీసుకొచ్చారు. మార్గమధ్యంలో ఎలాంటి అంతరాయం కల్గకుండా, ఆలస్యం కాకుండా పోలీసుల సహకారం అందించారు.
జి.పి.ఎస్ ట్రాకింగ్ సిస్టంతో సంబంధాలు తెగిపోకుండా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా ఎస్కార్ట్ తో ఆక్సిజన్ ట్యాంకర్ ను జిల్లా సర్వజన ఆసుపత్రి, సూపర్ స్పెషాలిటీ , కేన్సర్ ఆసుపత్రులకు తరలించారు. ఉదయం 10 గంటలకే ఆక్సిజన్ ట్యాంకర్ ఆస్పత్రులకు చేరడంతో ఇటు కోవిడ్ పేషెంట్లు, వారి సహాయకులు అటు ఆసుపత్రి వర్గాలు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీ భూసారపు సత్య ఏసుబాబు IPS గారు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రతీ రోజూ రావాల్సి ఆక్సీజన్ నిల్లల వాటాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో ట్యాంకర్ ద్వారా తెచ్చేందుకు ఎస్కార్ట్ కేటాయించారు. ట్యాంకర్ వాహనం ఖాళీగా వెళ్లేటప్పుడు మరియు ఆక్సీజన్ నిల్వల లోడ్ తో తిరిగి వచ్చేటప్పుడు ఎస్కార్ట్ వాహనం వెంట వెళ్తోంది.