400 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందచేసిన అమెరికా
విధాత :అమెరికా భారత వ్యూహాత్మక భాగస్వామ్యం కింద అమెరికా ప్రభుత్వం మన రాష్ట్రానికి 400 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందచేసినట్లు ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్ స్పెషాలాఫీసర్ డాక్టర్ ఆర్జా శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. కాన్సంట్రేటర్లు అందచేసిన అమెరికాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీలోని ఎపి భవన్ రెసిడెంట్ కమిషనర్ కస్టమ్స్ క్లియరెన్స్ అనంతరం ఈ కాన్సంట్రేటర్లను రాష్ట్రానికి తరలించామని ఆయన వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ సహకారంతో ఈ కాన్సంట్రేటర్లను అగర్వాల్ ప్యాకర్స్ ద్వారా […]

విధాత :అమెరికా భారత వ్యూహాత్మక భాగస్వామ్యం కింద అమెరికా ప్రభుత్వం మన రాష్ట్రానికి 400 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందచేసినట్లు ఏపీ కోవిడ్ కమాండ్ కంట్రోల్ స్పెషాలాఫీసర్ డాక్టర్ ఆర్జా శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. కాన్సంట్రేటర్లు అందచేసిన అమెరికాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీలోని ఎపి భవన్ రెసిడెంట్ కమిషనర్ కస్టమ్స్ క్లియరెన్స్ అనంతరం ఈ కాన్సంట్రేటర్లను రాష్ట్రానికి తరలించామని ఆయన వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ సహకారంతో ఈ కాన్సంట్రేటర్లను అగర్వాల్ ప్యాకర్స్ ద్వారా తూర్పుగోదావరికి 200, పశ్చిమ గోదావరికి 100, కృష్ణా జిల్లాకు 50, శ్రీకాకుళం జిల్లాకు 50 చొప్పున తరలించామని డాక్టర్ అర్జా శ్రీకాంత్ పేర్కొన్నారు.