అనంతపురం ఘటన దురదృష్టకరం: చంద్రబాబు
అనంతపురం జనరల్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 10 మంది రోగుల మృతి దురదృష్టకరమని చంద్రబాబు అన్నారు. వైసీపీ నాయకుల అవినీతికి ఆక్సిజన్ అందుతుంది కానీ ప్రజల ప్రాణాలు కాపాడటానికి ప్రభుత్వం ఆక్సిజన్ అందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. విజయనగరం, కర్నూలు ఘటనలపై శ్రద్ధ వహించి ఉంటే అనంతపురంలో ఈ ఘోరం జరిగేదికాదని చెప్పారు. సీఎం చేతకానితనానికి ప్రజలు బలవుతున్నారని చంద్రబాబు విమర్శించారు.

అనంతపురం జనరల్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 10 మంది రోగుల మృతి దురదృష్టకరమని చంద్రబాబు అన్నారు. వైసీపీ నాయకుల అవినీతికి ఆక్సిజన్ అందుతుంది కానీ ప్రజల ప్రాణాలు కాపాడటానికి ప్రభుత్వం ఆక్సిజన్ అందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
విజయనగరం, కర్నూలు ఘటనలపై శ్రద్ధ వహించి ఉంటే అనంతపురంలో ఈ ఘోరం జరిగేదికాదని చెప్పారు. సీఎం చేతకానితనానికి ప్రజలు బలవుతున్నారని చంద్రబాబు విమర్శించారు.