జగన్‌పై మరో కేసు.. గృహనిర్మాణ ప్రాజెక్టుల్లో అక్రమాలపై అభియోగపత్రం

జగన్‌పై మరో కేసు..విధాత:సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్‌పై కేసులు 18కి చేరాయి. గృహ నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించిన ఈడీ అభియోగ పత్రంపై న్యాయస్థానం ఇటీవల విచారణ ప్రారంభించింది. జగన్‌ సహా తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే; వసంత వెంకట కృష్ణ ప్రసాద్, ఇందూ గ్రూపు వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డిపై మరో కేసులో విచారణ మొదలైంది. 11 సీబీఐ, 6 ఈడీ కేసులు ఇప్పటికే విచారణ […]

జగన్‌పై మరో కేసు.. గృహనిర్మాణ ప్రాజెక్టుల్లో అక్రమాలపై అభియోగపత్రం

జగన్‌పై మరో కేసు..
విధాత:సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్‌పై కేసులు 18కి చేరాయి. గృహ నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించిన ఈడీ అభియోగ పత్రంపై న్యాయస్థానం ఇటీవల విచారణ ప్రారంభించింది. జగన్‌ సహా తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే; వసంత వెంకట కృష్ణ ప్రసాద్, ఇందూ గ్రూపు వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ రెడ్డి నిందితులుగా ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డిపై మరో కేసులో విచారణ మొదలైంది. 11 సీబీఐ, 6 ఈడీ కేసులు ఇప్పటికే విచారణ దశలో ఉండగా.. ఈడీ దాఖలు చేసిన మరో ఛార్జ్​షీట్‌నూ న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో అక్రమాలకు సంబంధించి ఈడీ గతంలోనే ఛార్జ్​షీట్ దాఖలు చేసినప్పటికీ.. కొన్ని లోపాల వల్ల న్యాయస్థానం వెనక్కు పంపింది. మార్చిలో మళ్లీ దాఖలు చేయగా.. గత నెల 23న విచారణ చేపట్టింది.వీరిపై అభియోగాలు.. సీఎం జగన్‌, తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి,వైకాపా ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్,ఇందూ గ్రూప్ అధినేత శ్యాంప్రసాద్ రెడ్డి,బెంగళూరు స్థిరాస్తి వ్యాపారి జితేంద్రవీర్వానీ,ఇందూ ప్రాజెక్ట్స్,సైబరాబాద్ హైటెక్ ఇంటిగ్రేటెడ్ టౌన్​షిప్ డెవలప్​మెంట్ కార్పొరేషన్,ఇందూ ఈస్టర్న్ ప్రావిన్స్ ప్రాజెక్ట్స్, ఇందూ రాయల్ హోమ్స్, వసంత ప్రాజెక్ట్స్,ఎంబసీ ప్రాపర్టీ డెవలప్​మెంట్స్‌ సంస్థలను ఈడీ నిందితుల జాబితాలో చేర్చింది.విజయసాయిరెడ్డికి రిలీఫ్!ఇప్పటివరకు దాఖలైన సీబీఐ, ఈడీ అభియోగపత్రాలన్నింటిలోనూ రెండో నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డిని ఈ కేసులో ఈడీ తొలగించింది. జగన్‌కు చెందిన కార్మెల్ ఏషియా, ఐఏఎస్ అధికారి ఎస్.ఎన్.మహంతి పేర్లు లేవు.

గృహనిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించిన ఛార్జ్​షీట్​లో జగన్ సహా 14 మంది నిందితులుగా సీబీఐ పేర్కొనగా.. ఈడీ 11 మందినే నిందితులుగా తెలిపింది. సీబీఐ అభియోగపత్రం ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ విచారణ జరిపింది. 117 కోట్ల 74 లక్షల రూపాయల ఆస్తులను 2018 జనవరిలో తాత్కాలికంగా జప్తు చేసింది. ఇందూ ప్రాజెక్ట్స్‌కు సంబంధించి అభివృద్ధి చేయని భూములు సహా వసంత ప్రాజెక్ట్స్, ఎంబసీ ప్రాపర్టీస్‌కు చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఈడీ అటాచ్ చేసింది. వైఎస్సార్ హయాంలో…వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏపీ హౌసింగ్ బోర్డు గృహనిర్మాణ ప్రాజెక్టుల సందర్భంగా.. ఇందూ గ్రూప్ అధినేత శ్యాంప్రసాద్ రెడ్డికి అప్పటి సర్కారు అనుచిత ప్రయోజనాలు కల్పించినట్లు సీబీఐ, ఈడీ ఆరోపించాయి.

ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి 70 కోట్ల రూపాయలను జగన్‌ కంపెనీల్లోకి మళ్లించగా… ప్రతిఫలంగా వైఎస్ సర్కారు తక్కువ ధరలకే హైదరాబాద్‌లోని కూకట్​పల్లిలో 65, గచ్చిబౌలిలో 21, బండ్లగూడలో 50, నంద్యాలలో 75 ఎకరాల చొప్పున కేటాయించినట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. బెంగళూరుకు చెందిన ఎంబసీ ప్రాపర్టీ డెవలప్​మెంట్స్ అధినేత జితేంద్రవీర్వానీ ఈ ప్రక్రియలో సహకరించడం ద్వారా… 50 కోట్ల 16 లక్షల రూపాయల అక్రమ లబ్ధి పొందినట్లు ఈడీ గుర్తించింది.విచారణ జూన్ 30కి వాయిదా.. ప్రస్తుతం తితిదే ఛైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి తన సహచరుడు, ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణప్రసాద్‌కు ప్రాజెక్టులో భాగస్వామ్యం కల్పించినట్లు ఈడీ దర్యాప్తులో తెలిపింది.

వైవీ సుబ్బారెడ్డి, కృష్ణప్రసాద్ కలిపి గచ్చిబౌలి ప్రాజెక్టులో నాలుగున్నర ఎకరాల వాటాను శ్యాంప్రసాద్ రెడ్డికి ఇచ్చినట్లు సీబీఐ కూడా తన ఛార్జ్​షీట్​లో వెల్లడించింది. ఏపీహెచ్‌బీకి నష్టం కలిగించి అక్రమ లబ్ధి పొందిన నిందితులపై మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 3, 4 ప్రకారం చర్యలు తీసుకోవాలని కోర్టును ఈడీ కోరింది. ఛార్జ్​షీట్‌పై విచారణను జూన్ 30కి కోర్టు వాయిదా వేసింది.