CHANDRABABU NAIDU | అవన్నీ చంద్రబాబు ఘనతలేనట!.. సోషల్‌మీడియాలో వెటకారాల వెల్లువ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మరోసారి తన వ్యాఖ్యలతో సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారారు. గుంటూరులో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన, దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ర్యాపిడో బైక్ ట్యాక్సీ యాప్ స్థాపకుడికి తానే స్ఫూర్తినని చెప్పడం వివాదాస్పదంగా మారింది.

CHANDRABABU NAIDU | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మరోసారి తన వ్యాఖ్యలతో సోషల్‌మీడియాలో హాట్‌టాపిక్‌గా మారారు. గుంటూరులో జరిగిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ప్రసంగించిన ఆయన, దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ర్యాపిడో బైక్ ట్యాక్సీ యాప్ స్థాపకుడికి తానే స్ఫూర్తినని చెప్పడం వివాదాస్పదంగా మారింది.
“ర్యాపిడో(Rapido) వ్యవస్థాపకుడు ఈ జిల్లాకే చెందినవాడు. అతని తండ్రి నిజామాబాద్ నుంచి గుంటూరుకు వలస వచ్చారు. టీడీపీ కార్యకర్త. నేను చెప్పిన విషయాల్ని గమనించేవాడు. కొడుకు ఐఐటీ చదివాడు. ఇప్పుడు దేశవ్యాప్తంగా బైక్‌లు, ఆటోలను ఒకే ప్లాట్‌ఫాంలో తీసుకొచ్చాడు. ఐడియా గ్రేట్ కాదు, ఆలోచన గ్రేట్,” అంటూ వ్యాఖ్యానించారు చంద్రబాబు(Chandrababu).
ఇందులోని అంశాలపై పరిశీలన సాగుతున్న సమయంలో ర్యాపిడో వ్యవస్థాపకుడు పవన్ గుంటూరుకి సంబంధం లేదన్న స్పష్టతతో నెటిజన్లు బాబుపై తీవ్రంగా సెటైర్లు వర్షించసాగారు.
గతంలోనూ ఇలానే…
ఇది ఏకైక ఉదాహరణ కాదని, గతంలోనూ చంద్రబాబు తనదిగా ఎన్నో ఘనతలను ప్రకటించుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
⦁ మైక్రోసాఫ్ట్ CEOగా సత్య నాదెళ్ల (Satya Nadella) ఎంపిక — ఘనత తనదేనని వ్యాఖ్య
⦁ ఓలింపిక్ పతకం సాధించిన పీవీ సింధు (PV Sindhu) — తన ప్రోత్సాహమే కారణమన్న వ్యాఖ్య
⦁ కరోనాకు వ్యాక్సిన్ (Covid vaccine) అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలపై — జీనోమ్ వ్యాలీ ఏర్పాటు తనదే అని చెప్పడం
⦁ ఇటీవలి యోగాంధ్ర కార్యక్రమంలో — “యోగాకు మార్కెట్ వీక్… అందుకే నేను తీసుకెళ్తున్నా” అంటూ అతిశయోక్తులు.
ఇలాంటి అభిప్రాయాలు ఆయన తన ప్రాచుర్యానికి, రాజకీయ మద్దతుకి ఉపయోగించుకునే ప్రయత్నంగా పలువురు భావిస్తున్నారు. మరికొందరు అయితే, ఈ తరహా వ్యాఖ్యలు బాబు మానసిక స్థితి (Mental Condition)పై ప్రశ్నలు లేవనెత్తేలా చేస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. నెటిజన్ల సెటైర్లు అగ్గి రాజేస్తున్నాయి(Social Media Satires) సోషల్‌మీడియాలో “ఇకపై ఏ కొత్త ఆవిష్కరణకైనా బాబుకే కాపీరైట్ ఇవ్వాలి” అంటూ ట్రోల్‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇంకా ఏయే ఘనతలు మిగిలాయో చెపితే, వాటికి కూడా ముందుగానే అభినందిద్దాం అంటూ కొందరు వేళాకోళం చేస్తున్నారు. వ్యక్తిగత ప్రచారం కోసం చరిత్రను మార్చేలా చెప్పడం ప్రజాస్వామ్యంలో గౌరవించదగిన చర్య కాదు. రాష్ట్ర ప్రగతికి నాయకత్వం వహించిన నాయకులు, అదే స్థాయిలో బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పరిశీలకులు అంటున్నారు.