Chandrababu Naidu| ఏపీలో ఐకానిక్ వంతెన నమూనా ఫిక్స్ చేసిన చంద్రబాబు

హైదరాబాద్-అమరావతిల మధ్య రూ.2500కోట్లతో నిర్మించనున్న ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మాణంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధానుల అనుసంధానంలో భాగంగా నిర్మించనున్న ఈ ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మాణ నమూనాను చంద్రబాబు ఖారారు చేశారు.

అమరావతి : ఏపీ అభివృద్ధిని(Andhra Pradesh Development) వేగవంతం చేసే లక్ష్యం దిశగా సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ముందడుగు వేస్తున్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రాజధాని అమరావతి..పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలతో పాటు పారిశ్రామిక, ఐటీ రంగాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన చంద్రబాబు ఏపీ భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయ, ఆక్వా రంగాల అభివద్ధిపైన కూడా దృష్టి పెట్టారు. అభివృద్ధి కీలక మార్గాలైన రహదారుల విస్తరణ చర్యలలో భాగంగా తెలుగు రాష్ట్రాల మధ్య దూరభారం తగ్గించేందుకు హైదరాబాద్-అమరావతిల మధ్య (Hyderabad-Amaravati Connectivity)రూ.2500కోట్లతో కృష్ణా నదిపై( Krishna River Bridge) నిర్మించనున్న ఐకానిక్ కేబుల్ వంతెన(Iconic Cable Bridge) నిర్మాణంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధానుల అనుసంధానంలో భాగంగా నిర్మించనున్న ఈ ఐకానిక్ కేబుల్ వంతెన నిర్మాణ నమూనాను సీఎం చంద్రబాబు ఖారారు చేశారు. ఇటీవల నాలుగు నమూనాలను సీఆర్ఢీఏ వెబ్ సైట్ లో ఉండి ఓటింగ్ పెట్టగా..మెజార్టీగా రెండో ఆప్షన్ గా ఉన్న డిజైన్ కు 14వేల వరకు ఓట్లు పోలయ్యాయి. దీంతే చంద్రబాబు కూడా అదే డిజైన్ ను ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన డీపీఆర్ పూర్తవ్వడంతో త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. ఎరుపు, తెలుపు రంగుల్లో జంట పైలాన్లతో కేబుల్ వంతెన నమూనా రూపొందించారు. స్వస్తిక హస్త రూపంలో ఉండే స్థానిక కూచిపూడి నృత్య భంగిమ డిజైన్‌ తో ఉంటుంది. ఈ ఐకానిక్ వంతెన రాయపూడి (అమరావతి) నుంచి కృష్ణా నదిని దాటి ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు నిర్మించనున్నారు.

తగ్గనున్న హైదరాబాద్-అమరావతి మధ్య 35కిలోమీటర్లు దూరం

కేబుల్ వంతెన ద్వారా అమరావతిలోని ఎన్‌13 రోడ్డును ఎన్‌హెచ్‌65 (విజయవాడ-హైదరాబాద్‌ జాతీయరహదారి)తో అనుసంధానించనున్నారు. దీంతో హైదరాబాద్-అమరావతి మధ్య 35 కీలోమీటర్ల దూరం తగ్గనుంది. ప్రస్తుతం ఎన్‌హెచ్‌-65 నుంచి అమరావతికి రావాలంటే దాదాపు 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. మూలపాడు, ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, కనకదుర్గ వంతెన, ప్రకాశం బ్యారేజీ మీదుగా రావాల్సి ఉంది. ఈ మార్గం రద్దీ సమయాల్లో వాహనాలతో కిక్కిరిసి ఉంటుంది. ఐకానిక్‌ వంతెన రాకతో ట్రాఫిక్‌ సమస్యలు తప్పడంతో పాటు మూలపాడు నుంచి 5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే అమరావతిలోకి చేరుకోవచ్చు. దీని వల్ల 35 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు గంటన్నర సమయం ఆదా అవుతుంది. విజయవాడ – హైదరాబాద్‌ జాతీయ రహదారి వద్ద కేబుల్ వంతెన ముగియనుంది. ఇక్కడ తేలికగా అటు విజయవాడ వైపు, ఇటు హైదరాబాద్‌ వైపు మారేందుకు ట్రంపెట్‌ ఇంటర్‌ఛేంజ్‌ నిర్మించనున్నారు.

ఆరు వరుసలుగా కేబుల్ వంతెన నిర్మాణం

అమరావతిలోని రాయపూడి నుంచి కృష్ణానది మీదుగా అవతల ఎన్‌హెచ్‌-65 వద్ద ఎన్టీఆర్‌ జిల్లా మూలపాడు వరకు 5.22 కిలోమీటర్ల పొడవున ఐకానిక్ కేబుల్‌ బ్రిడ్జిని నిర్మిస్తారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా వంతెనను ఆరు వరుసలుగా నిర్మిస్తారు. రెండు వైపులా కాలి బాటలు ఉంటాయి. నిప్పన్‌ కోయి లిమిటెడ్‌ వంతెన డీపీఆర్‌ను తయారు చేసింది.