దండుపాళ్యం బ్యాచ్‌ను పోలిన నేరస్థుల అరెస్ట్

విధాత‌:బెజవాడలో దండుపాళ్యం బ్యాచ్‌ను పోలిన నేరస్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీపీ బత్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ సీసీఎస్, పెనమలూరు పోలీసులు ఐదుగురు గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. నిందితులు ఆటో డ్రైవర్లు, పెయింటర్లుగా పని చేస్తుండగా ఒకరు కూరగాయల వ్యాపారం చేస్తారని చెప్పారు. పోరంకి, పెనమలూరులో ఉంటారని తెలిపారు. సుంకర గోపీరాజు, ప్రభుకుమార్ కలిసి ఈ నేరాలకు ప్లాన్ చేశారని మొదటి నేరం పెనమలూరులో చేశారన్నారు. కరోనా కాలం కావడంతో వీరు హత్య చేసిన […]

దండుపాళ్యం బ్యాచ్‌ను పోలిన నేరస్థుల అరెస్ట్

విధాత‌:బెజవాడలో దండుపాళ్యం బ్యాచ్‌ను పోలిన నేరస్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీపీ బత్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ సీసీఎస్, పెనమలూరు పోలీసులు ఐదుగురు గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. నిందితులు ఆటో డ్రైవర్లు, పెయింటర్లుగా పని చేస్తుండగా ఒకరు కూరగాయల వ్యాపారం చేస్తారని చెప్పారు. పోరంకి, పెనమలూరులో ఉంటారని తెలిపారు. సుంకర గోపీరాజు, ప్రభుకుమార్ కలిసి ఈ నేరాలకు ప్లాన్ చేశారని మొదటి నేరం పెనమలూరులో చేశారన్నారు. కరోనా కాలం కావడంతో వీరు హత్య చేసిన వారిని త్వరగా అంత్య క్రియలు చేశారని ఆయన చెప్పారు.

కంచికచెర్లలో ఇద్దరు వృద్ధ దంపతులను ఇలాగే హత్య చేశారన్నారు. ఇప్పటి దాకా ఐదు కేసుల్లో ఆరుగురిని హత్య చేసినట్లు తెలిపారు. 12న పెనమలూరులో ఏటీఎం బ్రేక్ చేసే యత్నం జరిగిందని… సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా పరిశోధన చేశామని తెలిపారు. కంచికచర్ల కేసు వేలిముద్రలు, ఏటీఎం నేరం వేలిముద్రలు ఒకటే కావడంతో మొత్తం కేసులు బయటపడ్డాయన్నారు. వీళ్ళు చేసిన నేరాలలో హత్య జరిగినట్టు బాధితులకే తెలీకపోవడం గమనార్హమని చెప్పుకొచ్చారు. ఇంటికి రెండు వైపులా తలుపులు ఉండే ఇళ్ళనే టార్గెట్ చేసినట్లు సీపీ బత్తిన శ్రీనివాసులు తెలిపారు.