బిగ్ బ్రేకింగ్: టాలీవుడ్‌లో మరో విషాదం.. గేయ రచయిత సిరివెన్నెల కన్నుమూత
విధాత: టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ మరణవార్త నుంచి సినీ ప్రేక్షకులు కోలుకునేలోపే మరో విషాదం అలుముకుంది. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ రోజు తుది శ్వాస విడిచారు. గత కొద్దికాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన.. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూశారు. సిరివెన్నెల అసలు పేరు చంబోలు సీతారామశాస్త్రి. సిరివెన్నెల సీతారామశాస్త్రి పుట్టినతేదీ 20 మే, 1955 ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో […]

విధాత: టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ మరణవార్త నుంచి సినీ ప్రేక్షకులు కోలుకునేలోపే మరో విషాదం అలుముకుంది. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ రోజు తుది శ్వాస విడిచారు. గత కొద్దికాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న ఆయన.. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు కన్నుమూశారు. సిరివెన్నెల అసలు పేరు చంబోలు సీతారామశాస్త్రి.
సిరివెన్నెల సీతారామశాస్త్రి పుట్టినతేదీ 20 మే, 1955 ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో జన్మించారు. 1984లో బాలకృష్ణ హీరోగా వచ్చిన జననీ జన్మభూమి సినిమాతో కెరీర్ ప్రారంభించగా కె.విశ్వనాథ్ సిరివెన్నెల సినిమాతో గుర్తింపు వచ్చి సినిమా పేరు ఇంటిపేరుగా మారిపోయింది. కాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆయనకు బంధువు..
రామ్ గోపాల్ వర్మ కృష్ణవంశీ కె.విశ్వనాథ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇలాంటి దర్శకులందరూ సిరివెన్నెల పాట లేకపోతే సినిమా చేయరు. 2019లో సిరివెన్నెలకు పద్మశ్రీ వచ్చింది. తన కెరీర్లో ఉత్తమ గేయరచయితగా 11నంది అవార్డులు.. నాలుగు ఫిలింఫేర్ ఆవార్డులు పొందారు. ఇటీవల ట్రిబుల్ ఆర్ సినిమాలో దోస్తీ పాట రాసింది సిరివెన్నెల సీతారామశాస్త్రినే.
సీతారామశాస్త్రి మృతిపై కిమ్స్ వైద్యులు ప్రకటన విడుదల
గేయ రచయిత సిరివెన్నెల మృతిపై కిమ్స్ వైద్యులు ప్రకటన విడుదల చేశారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యుమోనియా తో 24న సికింద్రాబాద్‌లోని కిమ్స్ చేరారని, ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధిత సమస్యలతో మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు తుదిశ్వాస విడిచారని తెలిపారు. ఐసీయూలో ఉంచి ఎక్మో మిషన్‌పై చికిత్స అందించామన్నారు. చివరకు ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాపించడంతో పరిస్థితి విషమించి కన్నుమూశారన్నారు.
అయితే గత ఆరు సంవత్సరాల క్రితమే ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడడంతో సగం ఊపిరితిత్తిని తొలగించామన్నారు. ఆ తర్వాత ఆయనకు బైపాస్ సర్జరీ కూడా చేసినట్లు తెలిపారు. మళ్లీ గతవారం కిందట మరో వైపు ఉన్న ఊపిరితిత్తులకు క్యాన్సర్ సోకిందని, దీంతో ఆపరేషన్ చేసి సగం తొలగించినట్లు చెప్పారు.
ఆ తర్వాత రెండు రోజులు బాగున్నారని , 55 శాతం ఉన్న ఊపిరితిత్తులకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చిందన్నారు. ఆక్సినేషన్ లేకపోవడంతో ఐదు రోజులు ఎక్మో మిషన్‌పై ఉంచామని తెలిపారు. ఆ తర్వాత క్యాన్సర్, పోస్ట్ బైపాస్ సర్జరీ, కిడ్నీలు దెబ్బతినడం, ఇన్ఫెక్షన్ శరీరమంతా సోకి చివరకు తుది శ్వాస విడిచారన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు.