చంద్రబాబు సిఎం కాగానే పిచ్చి ఆసుపత్రి నిర్మిస్తాం..వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలను అందులో చేర్పిస్తాం..!

విధాత‌: చంద్రబాబు మీద దాడికి జోగి రమేష్ వచ్చారు,మేమంతా కలిసి వారి ప్రయత్నం అడ్డుకున్నాం జోగి రమేష్ పై పోలీసులు కు మేము ఫిర్యాదు కూడా చేశాం.దాడి ప్రయత్నాన్ని అడ్డుకున్న మా మీద ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం అన్యాయం.పోలీసు అధికారుల సంఘం తో కూడా ప్రకటనలు ఇప్పిస్తున్నారు,రాజకీయ వ్యవస్థ కంటే ఘోరంగా మాట్లాడుతున్నారని బుద్దా వెంకన్న వెల్ల‌డించారు. కొంతమంది పోలీసులు ప్రమోషన్ల కోసం ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారు,మా అధినేత ఇంటి మీదకు వచ్చిన జోగి రమేపై […]

చంద్రబాబు సిఎం కాగానే పిచ్చి ఆసుపత్రి నిర్మిస్తాం..వైసిపి మంత్రులు, ఎమ్మెల్యేలను అందులో చేర్పిస్తాం..!

విధాత‌: చంద్రబాబు మీద దాడికి జోగి రమేష్ వచ్చారు,మేమంతా కలిసి వారి ప్రయత్నం అడ్డుకున్నాం జోగి రమేష్ పై పోలీసులు కు మేము ఫిర్యాదు కూడా చేశాం.దాడి ప్రయత్నాన్ని అడ్డుకున్న మా మీద ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం అన్యాయం.పోలీసు అధికారుల సంఘం తో కూడా ప్రకటనలు ఇప్పిస్తున్నారు,రాజకీయ వ్యవస్థ కంటే ఘోరంగా మాట్లాడుతున్నారని బుద్దా వెంకన్న వెల్ల‌డించారు.

కొంతమంది పోలీసులు ప్రమోషన్ల కోసం ప్రభుత్వానికి ఊడిగం చేస్తున్నారు,మా అధినేత ఇంటి మీదకు వచ్చిన జోగి రమేపై బెయిల్ బుల్ సెక్షన్లా,గొడవ ను ఆపిన మా మీద ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ల కింద కేసులా.పోలీసు అధికారులు సంఘం దీనిని ఎందుకు ప్రశ్నించడం లేదు,మేము దళితుల పేరుతో ఎక్కడైన దూషించామా… నిరూపించండి.

జోగి రమేష్ చంద్రబాబు, ఆయన సామాజిక వర్గం పై మాట్లాడారు,కులాల కుంపట్లు పెట్టి.. రెచ్చ గొట్టింది వాళ్లు.తప్పు చేసిన వారిని వదిలేసి, మా పై అన్యాయం గా కేసులు పెడుతున్నారు,చత్తీస్‌గఢ్ తరహాలో ప్రజలు పోలీసులపై తిరగబడే రోజు వస్తుంది.ప్రభుత్వం పెద్దలకు వంత పాడటం పోలీసు అధికారులు సంఘం మానుకోవాలి.కొంతమంది చేసే తప్పులకు…‌ వ్యవస్థ మొత్తం నింద మోయాల్సి వస్తుంది.ఆంద్రా పోలీసు అంటే… సినిమా పోలీసు అనే అపవాదు మూట కట్టుకున్నారు.

మీ స్వార్ధ ప్రయోజనాల కోసం ..నిజాయితీ అధికారులు జీవితాలను బలి చేయవద్దు,వరుస సంఘటనలు పరిశీలించి అప్పుడు సంఘాలు న్యాయంగా స్పందిస్తే స్వాగతిస్తాం,2024ఎన్నికలలో టిడిపి అధికారం లోకి రావడం ఖాయమ‌న్నారు.

చంద్రబాబు సిఎం కాగానే… వంద ఎకరాలలో పిచ్చి ఆసుపత్రి నిర్మాణం చేస్తాం,వైసిపి మంత్రులు, ఎమ్మెల్యే లను చేర్పించి వారి మాటలను వారికే చూపిస్తాం,ఆ తరువాత వైద్యులు తో ప్రత్యేక వైద్యం అందిస్తాం.జడ్పీటీసీ, ఎంపిటీసి ఎన్నికలను టిడిపి బహిష్కరించింది,నిన్న ఫలితాలు తరువాత వైసిపి నేతలు గెలిచామని జబ్బలు చరుస్తున్నారు నిజంగా మీకు ప్రజా బలం ఉంటే..‌ ఇప్పుడు ఎన్నికలకు రండి మేము ఓడితే.. టిడిపిని మూసేస్తాం.

పోలీసులు కూడా వైసిపి ప్రభుత్వం ఎప్పుడు దిగి పోతుందా అని ఎదురు చూస్తున్నారు కొంతమంది చట్టాన్ని.. జగన్ చుట్టంగా మార్చేశారు.మా పై అన్యాయంగా పెట్టిన కేసులను పోలీసులు ఉపసంహరించు కోవాలి,డిజిపి కి మెమోరాండం ఇచ్చేందుకు వెళితే.. మా పై కేసులు ఏంటి.పోలీసు అధికారులు సంఘం మాకు జరిగిన అన్యాయం పై స్పందించాలి,ఈ కేసుల పై పోలీసు అధికారులు వారి అంతరాత్మను ప్రశ్నించుకోవాలి అక్రమ కేసుల పై మా పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.