రాజధాని నిర్ణయం రాష్ట్రానికి సంబంధించిన అంశం
అమరావతి,విధాత: రాజధాని నిర్ణయం రాష్ట్రానికి సంబంధించిన అంశమని కేంద్ర ప్రభుతం పేర్కొంది. సమాచార హక్కు చట్టం ద్వారా కేంద్రం స్పష్టం చేసింది. హైదరాబాద్కు చెందిన చైతన్యకుమార్రెడ్డి, ప్రధానికి రాసిన లేఖలో ఏపీ రాజధాని గురించి ప్రశ్నలు సంధించారు. కేంద్ర హోంశాఖకు చైతన్యకుమార్ లేఖను సీఎంవో పంపింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ చట్టం కింద ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల్ని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది. 3 పరిపాలనా కేంద్రాలు ఉంటాయని కేంద్ర హోంశాఖ పేర్కొంది. […]

అమరావతి,విధాత: రాజధాని నిర్ణయం రాష్ట్రానికి సంబంధించిన అంశమని కేంద్ర ప్రభుతం పేర్కొంది. సమాచార హక్కు చట్టం ద్వారా కేంద్రం స్పష్టం చేసింది. హైదరాబాద్కు చెందిన చైతన్యకుమార్రెడ్డి, ప్రధానికి రాసిన లేఖలో ఏపీ రాజధాని గురించి ప్రశ్నలు సంధించారు. కేంద్ర హోంశాఖకు చైతన్యకుమార్ లేఖను సీఎంవో పంపింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పరిపాలనా వికేంద్రీకరణ చట్టం కింద ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల్ని ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంశాఖ పేర్కొంది. 3 పరిపాలనా కేంద్రాలు ఉంటాయని కేంద్ర హోంశాఖ పేర్కొంది. రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమని కేంద్రం స్పష్టం చేసింది.