రైతుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ‌

విధాత‌(అమరావతి): వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్ పథకం కింద అన్న‌దాత‌ల బ్యాంక్ ఖాతాల్లో న‌గ‌దును జ‌మ చేసింది ఏపీ ప్ర‌భుత్వం. మొదట విడతగా 3 వేల 900 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేయనుంది. దీంతో 52.38 లక్షల మంది రైతులకు లబ్ధి కలుగనుంది. 2019-20 సంవత్సరంలో 46. 69 లక్షల రైతు కుటుంబాలకు 6,173 కోట్లు, 2020-21 సంవత్సరంలో 51.59 లక్షల మందికి 6,928 కోట్లు. ప్రస్తుత ఏడాది 52.38 లక్షల మంది రైతులకు […]

రైతుల ఖాతాల్లో న‌గ‌దు జ‌మ‌

విధాత‌(అమరావతి): వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్ పథకం కింద అన్న‌దాత‌ల బ్యాంక్ ఖాతాల్లో న‌గ‌దును జ‌మ చేసింది ఏపీ ప్ర‌భుత్వం. మొదట విడతగా 3 వేల 900 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేయనుంది. దీంతో 52.38 లక్షల మంది రైతులకు లబ్ధి కలుగనుంది.

2019-20 సంవత్సరంలో 46. 69 లక్షల రైతు కుటుంబాలకు 6,173 కోట్లు, 2020-21 సంవత్సరంలో 51.59 లక్షల మందికి 6,928 కోట్లు. ప్రస్తుత ఏడాది 52.38 లక్షల మంది రైతులకు మొదటి విడతగా 3,900 కోట్ల ఆర్థిక సాయం. నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ఆన్ లైన్ ద్వారా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో రైతు భరోసా ఆర్థిక సాయాన్ని జమ చేశారు.

ఏపీలో సాగుచేసే యానాం రైతులకు, కౌలు రైతులకు వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ అందించాలని నిర్ణయం. లబ్ధిదారుల జాబితా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శన. ఇంకా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చు.