రైతుల కోసం 2531 బహుళ ప్రాయోజిత కేంద్రాలు -మంత్రి కన్నబాబు

విధాత:రాష్ట్రంలో రైతుల కోసం 2531 బహుళ ప్రాయోజిత కేంద్రాలు. రూ .1584 కోట్లతో వ్యవసాయ, ఇతర అనుబంధ రంగాల మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం జగన్ ఆదేశాలతో పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేసాం. తొలిదశ లో రూ .659 కోట్లతో 1255 ,రెండవ దశలో రూ .925 కోట్లతో 1276 బహుళ ప్రాయోజిత కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం.ఇందుకు సంబంధిచి తొలిదశ పనులకు 4 ప్యాకేజి ల్లో టెండర్ల ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. వచ్చే నవంబర్ నాటికి […]

రైతుల కోసం 2531 బహుళ ప్రాయోజిత కేంద్రాలు -మంత్రి కన్నబాబు

విధాత:రాష్ట్రంలో రైతుల కోసం 2531 బహుళ ప్రాయోజిత కేంద్రాలు. రూ .1584 కోట్లతో వ్యవసాయ, ఇతర అనుబంధ రంగాల మౌలిక సదుపాయాల కల్పనకు సీఎం జగన్ ఆదేశాలతో పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేసాం. తొలిదశ లో రూ .659 కోట్లతో 1255 ,రెండవ దశలో రూ .925 కోట్లతో 1276 బహుళ ప్రాయోజిత కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం.ఇందుకు సంబంధిచి తొలిదశ పనులకు 4 ప్యాకేజి ల్లో టెండర్ల ప్రక్రియను అధికారులు ప్రారంభించారు.

వచ్చే నవంబర్ నాటికి వీటి తొలి దశ నిర్మాణాలను పూర్తి చేసి ఖరీఫ్ నుంచే రైతులకు వీటి సేవలందించేలా సీఎం జగన్ మోహన్ రెడ్డి సంకల్పించారు.బహుళ ప్రాయోజిత కేంద్రాల చుట్టూ కాంపౌడ్ వాల్ , లైటింగ్ , బోర్లా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకొవాలి

వ్యవసాయాభివృద్ధికి అనుబంధ శాఖలు సమన్వయంతో పనిచేయాలి .వ్యవసాయ , మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులుతో సమావేశాన్ని ఆయన వ్యవసాయ రంగానికి మౌలిక సదుపాయాల కల్పన పై సమీక్ష .

ముఖ్యమంత్రి వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటున్నారు.
వైఎస్సార్ జయంతి సందర్భంగా జులై 8 న నిర్వహిస్తున్న రైతు దినోత్సవ ఏర్పాట్లను సమీక్షించిన మంత్రి కన్నబాబు.
వ్యవసాయ పనిముట్ల పంపిణీ కోసం మొదటి దశ కస్టమ్ హైరింగ్ సెంటర్లు , హబ్ల సంఘాలను,తొలిదశ సమీకృత టెస్టింగ్ ల్యాబ్లను, ఆర్బీకే శాశ్వత భవనాలను కూడా ముఖ్యమంత్రి రైతు దినోత్సవం నాడు ప్రారంభిస్తారు.

ఇంటిగ్రేటెడ్ టెస్టింగ్ ల్యాబ్ లు ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలి

గోదాములు ఏర్పాటుకు సంబందించి భూముల ఎంపిక, నిర్మాణాలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర , జేసీలతో సమన్వయము చేసుకుని త్వరిత గతిన చర్యలు తీసుకోవాలి.రాష్ట్రంలో మరో 25 నూతన రైతు బజార్లను ఏర్పాటు చేస్తున్నాం.మామిడి ధరల విషయంలో రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి. సమీక్ష లో భాగంగా వ్యవసాయ అనుబంధ శాఖలైన మత్స్య , పశు సంవర్ధక శాఖల ఉన్నతాధికారులతో సుదీర్ఘ చర్చ. వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డా పూనమ్ మాల కొండయ్య , అగ్రకల్చర్ కమిషనర్ అరుణ్ కుమార్ , మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న, కోపెరేటివ్ కమీషనర్ అహ్మద్ బాబు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ReadMore:ఆ ఘటన నా మనసును చాలా కలచివేసింది: జగన్