ఏపీ రాజధాని విషయంలో కేంద్రం తప్పును సరిదిద్దుకుంది.!
విధాత: జులై 26న లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఏపీ రాజధాని వైజాగ్ అని అర్థం వచ్చేలా కేంద్రం సమాధానమిచ్చింది. వైజాగ్ ఏపీ రాజధాని అని చెప్పటం తమ ఉద్దేశం కాదని తాజాగా కేంద్రం స్పష్టం చేసింది.విశాఖ ఏపీ రాజధాని కాదని, అది ఒక నగరం మాత్రమేనని వెల్లడించింది.పెట్రోలియం ట్యాక్స్‌కు సంబంధించి మాత్రమే విశాఖ పేరును ఉదహరించామని పేర్కొంది. హెడ్డింగ్ పొరపాటు వల్లే ఈ సమస్య తలెత్తిందని కేంద్రం తెలిపింది.హెడ్డింగ్‌లో క్యాపిటల్‌తో పాటు సమాచారం సేకరించిన నగరం […]

విధాత: జులై 26న లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఏపీ రాజధాని వైజాగ్ అని అర్థం వచ్చేలా కేంద్రం సమాధానమిచ్చింది. వైజాగ్ ఏపీ రాజధాని అని చెప్పటం తమ ఉద్దేశం కాదని తాజాగా కేంద్రం స్పష్టం చేసింది.విశాఖ ఏపీ రాజధాని కాదని, అది ఒక నగరం మాత్రమేనని వెల్లడించింది.పెట్రోలియం ట్యాక్స్‌కు సంబంధించి మాత్రమే విశాఖ పేరును ఉదహరించామని పేర్కొంది.
హెడ్డింగ్ పొరపాటు వల్లే ఈ సమస్య తలెత్తిందని కేంద్రం తెలిపింది.హెడ్డింగ్‌లో క్యాపిటల్‌తో పాటు సమాచారం సేకరించిన నగరం పేరును ఇప్పుడు చేర్చుతున్నామని ప్రకటించింది. లోక్‌సభ సచివాలయానికి కూడా సమాచారం ఇచ్చామని, ప్రధాన నగరాలలో పెట్రోల్ ధరల ప్రభావాన్ని అంచనా వేశామని తెలిపింది. హర్యానాలో అంబాలా, పంజాబ్‌లో జలంధర్ నగరాలను తీసుకున్నామని, అంబాలా, జలంధర్ నగరాలు ఆ రాఫ్ట్రాల రాజధానులు కావని కేంద్రం స్పష్టం చేసింది.