డబుల్ ఓట్లపై చర్యలకు ఈసీ ఆదేశం

తెలంగాణతో పాటు ఏపీలోనూ ఓటు హక్కు ఓట్లను తొలగింపుకు చర్యలు తీసుకోవాలన్న వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు మేరకు నకిలీ, డబుల్ ఓట్ల తొలగింపుకు చర్యలు తీసుకోవాలని సీఈవో ఆదేశించారు

డబుల్ ఓట్లపై చర్యలకు ఈసీ ఆదేశం

విధాత : తెలంగాణతో పాటు ఏపీలోనూ ఓటు హక్కు ఉన్న వారి డబుల్ ఓట్లను తొలగింపుకు చర్యలు తీసుకోవాలన్న ఏపీ వైఎస్సార్‌సీపీ పార్టీ ఫిర్యాదు మేరకు నకిలీ, డబుల్ ఓట్ల తొలగింపుకు చర్యలు తీసుకోవాలని సీఈవో ముఖేష్ కుమార్‌ మీనా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వేరే రాష్ట్రాల్లో ఉన్నవారికి ఏపీలో ఓట్లు ఉంటే వాటిని ఏరివేయాలని, ఒక వ్యక్తికి ఒకే నియోజకవర్గం, ఒకే రాష్ట్రంలో ఓటు ఉండేలా చూడాలని కలెక్టర్లను, ఆర్టీవోలను సీఈవో ఆదేశించారు.


డబుల్ ఓట్లను తొలగించాలని, ఫామ్‌ -6 ద్వారా కొత్త ఓట్లు నమోదు చేయాలని, కొత్త ఓటు నమోదు ముందు మరెక్కడ ఓటు లేనట్లుగా డిక్లరేషన్ తీసుకోవాలన్నారు. తప్పుడు డిక్లరేషన్ ఇచ్చే వారిపై కేసులు పెట్టాలని సీఈవో స్పష్టం చేశారు. మరోవైపు బోగస్ ఓట్ల ఏరివేత పేరుతో తమ పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగిస్తున్నారంటూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.