దేశంలోనే తొలి క్వాంటం ఫెసిలిటీ సెంటర్‌గా ఏపీ : సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో తొలి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. దీంతో దేశంలోనే క్వాంటమ్ టెస్ట్ సెంటర్ కలిగిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది.
అమరావతి : ప్రపంచ క్వాంటమ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ లో నూతన అధ్యాయం ఆవిష్కృతమైంది. భారత్ లో తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీ సెంటర్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.
అమరావతి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోని 1ఎస్ ఓపెన్ యాక్సెస్ క్వాంటమ్ ఫెసిలిటీ సహా, మేధా టవర్స్ లోని 1 క్యూ క్వాంటమ్ ఫెసిలిటీని చంద్రబాబు ప్రారంభించారు. 1ఎస్, 1క్యూ క్వాంటం టెస్ట్‌బెడ్స్‌ను సీఎం జాతికి అంకితం చేశారు. ఈ రెండు క్వాంటమ్ టెస్ట్ బెడ్స్ ద్వారా క్వాంటం కంప్యూటింగ్ ఉపకరణాలను పరీక్షించేలా సదుపాయం ఏర్పడింది. ఈ కంప్యూటర్ల ఆవిష్కరణతో దేశంలోనే క్వాంటమ్ టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఏపీ అవతరించింది.
దీంతో దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.
దీనికి టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ సహకారం అందించింది. ఈ కార్యక్రమానికి నేషనల్ క్వాంటం మిషన్ సభ్యులు సహా ఐఐటీ ప్రొఫెసర్లు, క్వాంటం రంగ శాస్త్రవేత్తలు, క్వాంటం ఇన్నోవేషన్ స్టార్టప్‌ల ప్రతినిధులు, రీసెర్చ్ స్కాలర్లు, నిపుణులు హాజరయ్యారు. ఏపీలోని వివిధ వర్సిటీలు, కాలేజీల నుంచి వర్చువల్‌గా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 లక్షల మంది విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.
ఇవి కూడా చదవండి :
పెళ్లి కారు అలంకరణలో కొత్త ట్రెండ్.. !
పేరుకే ద్విచక్ర వాహనం..ఆరుగురి ప్రయాణం!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram