పేరుకే ద్విచక్ర వాహనం..ఆరుగురి ప్రయాణం!
ద్విచక్ర వాహనంపై ఆరుగురి దుస్సాహస ప్రయాణం! మడకశిరలో టీవీఎస్ XL పై భార్య, నలుగురు పిల్లలతో వెళ్లిన వ్యక్తి వీడియో వైరల్.
విధాత : ద్విచక్ర వాహనాలు అంటే ఇద్దరు అధికారికంగా ప్రయాణించే వాహనం. కొందరైతే చిన్న పిల్లలతో కలిసి ముగ్గురు, నలుగురు ప్రయాణించడం చూస్తుంటాం. అయితే ఓ టీవీఎస్ ఎక్స్ ఎల్ ద్విచక్ర వాహనంపై ఏకంగా ఆరుగురు ప్రయాణించిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర జిల్లాలో ఓ టీవీఎస్ XL వాహనంపై ఆరుగురు కుటుంబ సభ్యులు ప్రమాదకర ప్రయాణం సాగించారు. వాహనానికి ఊత కర్ర అమర్చిన ఓ వ్యక్తి తనతో పాటు భార్య, నలుగురు పిల్లలను కూర్చోబెట్టి దానిపై మొత్తం ఆరుగురు ప్రయాణించారు. రోడ్డు వెంట వారి దుస్సాహస ప్రయాణ దృశ్యాన్ని చూసిన స్థానికులు షాక్ తో నోరెళ్లబెట్టి చూశారు. కొందరైతే మీకిదేం పోయే కాలం రా?..అంతమంది దానిపై ప్రమాదకరంగా వెలుతున్నారంటూ విమర్శలు అందుకున్నారు. ఈ వీడియో చూసిన అధికారులు ఇలాంటి ప్రయాణం అత్యంత ప్రమాదకరం అని, ఇలాంటి ఘటనలతో ప్రమాదాలు, ప్రాణాపాయాలు ఉంటాయని, చట్టపరంగా కూడా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
నాడు కాలుష్య రిఫైనరీ.. నేడు ప్రపంచ స్థాయి మామిడి పండ్ల ఎగుమతి కేంద్రం!
Anchor Suma | కారులో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న సుమ.. నవ్వు వెనుక ఉన్న కష్టం బయటపెట్టిన స్టార్ యాంకర్
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram