నేడు కుప్పంలో చంద్రబాబు..

విధాత‌: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇవాళ చిత్తూరు జిల్లాలోని కుప్పంలో పర్యటించనున్నారు.కుప్పం మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికను పరిశీలించనున్నారు.కుప్పం మున్సిపాల్టీకి ఎన్నిక జరుగుతుండటంతో అక్కడ అధికార వైకాపా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని తెదేపా ఆరోపిస్తోంది.దొంగ ఓట్లు వేసేందుకు ఇప్పటికే వివిధ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున వైకాపా శ్రేణులను మోహరించిందని, రాష్ట్ర ఎన్నికల సంఘంతోపాటు డీజీపీ, ఇతర రాజ్యాంగబద్ద సంస్థలకు తెదేపా ఫిర్యాదు చేసింది.