అమిత్‌షాకు ఘనస్వాగతం పలికిన సీఎం జగన్
విధాత: రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. తిరుపతి తాజ్ హోటల్‌లో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన అమిత్‌షాకు స్వాగతం పలికిన సీఎం జగన్ అక్కడి నుంచి తిరుమల బయలుదేరారు. అనంతరం వారిద్దరూ శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం సీఎం జగన్ రేణిగుంట చేరుకుని తిరిగి తాడేపల్లి బయలుదేరుతారు. ముందుగా రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, […]

విధాత: రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. తిరుపతి తాజ్ హోటల్‌లో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన అమిత్‌షాకు స్వాగతం పలికిన సీఎం జగన్ అక్కడి నుంచి తిరుమల బయలుదేరారు. అనంతరం వారిద్దరూ శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం సీఎం జగన్ రేణిగుంట చేరుకుని తిరిగి తాడేపల్లి బయలుదేరుతారు.
ముందుగా రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గౌతమ్‌రెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, మేయర్ శిరీష స్వాగతం పలికారు. ఆదివారం సీఎం షెడ్యూల్ ఇలా : ఆదివారం మధ్యాహ్నం 1.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి తిరుపతి బయలుదేరుతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరుపతి తాజ్ హోటల్‌లో అమిత్ షా అధ్యక్షతన జరిగే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు.