జగన్ మోహన్ రెడ్డి కాపు నేస్తం కాదు కాపు ద్రోహి
విధాత: గత రెండు సంవత్సరాలుగా కేవలం 940కోట్లు ఖర్చుపెట్టి 12600 కోట్లుగా ప్రచారం చేసుకొంటూ మోసం చేస్తున్న జగన్ రెడ్డి దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు కొత్త నాగేంద్రకుమార్.ప్రభుత్వ పథకాలైన సామాజిక పెన్షన్లు, వృద్ధాప్య, వితంతు, వికలాంగ, ఒంటరి మహిళ పెన్షన్ లను కుల కార్పొరేషన్ నిధులతో ముడి వేయడం జగన్మోహన్ రెడ్డి కే చెల్లింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు కూడా కులాన్ని అంటగట్టిన ఘటన జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. రైతు భరోసా, పంట వడ్డీ, […]

విధాత: గత రెండు సంవత్సరాలుగా కేవలం 940కోట్లు ఖర్చుపెట్టి 12600 కోట్లుగా ప్రచారం చేసుకొంటూ మోసం చేస్తున్న జగన్ రెడ్డి దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు కొత్త నాగేంద్రకుమార్.ప్రభుత్వ పథకాలైన సామాజిక పెన్షన్లు, వృద్ధాప్య, వితంతు, వికలాంగ, ఒంటరి మహిళ పెన్షన్ లను కుల కార్పొరేషన్ నిధులతో ముడి వేయడం జగన్మోహన్ రెడ్డి కే చెల్లింది.
దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు కూడా కులాన్ని అంటగట్టిన ఘటన జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. రైతు భరోసా, పంట వడ్డీ, రుణమాఫీ లాంటి పథకాలకు కూడా కుల కార్పొరేషన్ నిధుల నుండి మళ్ళించి ఏదో ఘనకార్యం చేసిన విధంగా ప్రచారం చేసుకుంటున్నారు.గత ప్రభుత్వం కాపు కార్పొరేషన్ కు 1000కోట్లు కేటాయిస్తే సరిపోదు నేను రెండు వేల కోట్లు కేటాయిస్తా అన్న జగన్ మోహన్ రెడ్డి ఈనాడు కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేసాడు.