తిరుపతిలో సీఎం జగన్
విధాత: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి, తిరుమలలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్ సెంటర్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం అలిపిరి వద్దకు చేరుకున్న సీఎం జగన్.. శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడక మార్గం, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభించారు. అనంతరం తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని స్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు […]

విధాత: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి, తిరుమలలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు. తిరుపతి బర్డ్ ఆసుపత్రిలో శ్రీపద్మావతి చిన్న పిల్లల కార్డియాక్ సెంటర్‌ను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం అలిపిరి వద్దకు చేరుకున్న సీఎం జగన్.. శ్రీవారి పాదాల వద్ద నుంచి తిరుమలకు నడక మార్గం, పై కప్పును, గోమందిరాన్ని ప్రారంభించారు.
అనంతరం తిరుమలలోని బేడి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని స్వామి దర్శనం చేసుకుంటారు. అనంతరం శ్రీవారి ఆలయానికి చేరుకుని స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. స్వామివారి దర్శనం అనంతరం ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత పద్మావతి అతిథి గృహానికి చేరుకుని, రాత్రికి అక్కడే బస చేస్తారు.