తిరుపతి ఎంపీగా డాక్టర్ గురుమూర్తి

డిక్లరేషన్ అందజేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ సీఎం జగన్మోహన్ రెడ్డి కి జీవిత కాలం రుణపడి ఉంటా.. ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు సేవకుడిగా పనిచేస్తా..: తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి. తిరుపతి ఎంపీగా డాక్టర్ గురుమూర్తి విజయకేతనం ఎగురవేశారు. 2 లక్షలా 70 వేల ఓట్ల పై చిలుకు ఓట్ల మెజార్టీతో విజయ దుందుభి మోగించారు. ఎన్నికల ఫలితాల అనంతరం నెల్లూరు డికేడబ్ల్యు కళాశాలలో రిటర్నింగ్ అధికారి, నెల్లూరు జిల్లా […]

తిరుపతి ఎంపీగా డాక్టర్ గురుమూర్తి

డిక్లరేషన్ అందజేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి, నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్

  • సీఎం జగన్మోహన్ రెడ్డి కి జీవిత కాలం రుణపడి ఉంటా..
  • ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు సేవకుడిగా పనిచేస్తా..: తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి.

తిరుపతి ఎంపీగా డాక్టర్ గురుమూర్తి విజయకేతనం ఎగురవేశారు. 2 లక్షలా 70 వేల ఓట్ల పై చిలుకు ఓట్ల మెజార్టీతో విజయ దుందుభి మోగించారు. ఎన్నికల ఫలితాల అనంతరం నెల్లూరు డికేడబ్ల్యు కళాశాలలో రిటర్నింగ్ అధికారి, నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు గురుమూర్తికి డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు. ఆదివారం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు నెల్లూరు, తిరుపతి కేంద్రాలుగా సాగింది.

అనంతరం గురుమూర్తి మీడియాతో మాట్లాడారు.. తనపై నమ్మకంతో అత్యధిక సంఖ్యలో ఓట్లు వేసి గెలిపించిన తిరుపతి పార్లమెంటు పరిధిలోని ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ఆజన్మాంతం రుణపడి ఉంటానని, సీఎం ఆధ్వర్యంలో తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.

డిక్లరేషన్ అందుకున్న సమయంలో ఎంపీ డాక్టర్ గురుమూర్తి తో పాటు ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, సూళ్లురు పేట ఎమ్మెల్యే సంజీవయ్య తదితరులు ఉన్నారు. పలువురు ప్రముఖులు గురుమూర్తికి శుభాకాంక్షలు తెలిపారు. డిక్లరేషన్ అనంతరం ఎంపీ గురుమూర్తి తో పాటు చెవిరెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి విజయకేతనం చూపారు..