అగ్రిగోల్డ్‌ ఆస్తుల నుంచి ఆదాయార్జన..

విధాత‌ : అగ్రిగోల్డ్‌ సంస్థకు సంబంధించి ఇప్పటివరకు జప్తు చేసిన ఆస్తుల నుంచి ఆదాయం రాబట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆయా ఆస్తుల్ని అద్దె, లీజుకు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకునేందుకు సీఎస్‌ అధ్యక్షతన అధీకృత కమిటీని ఏర్పాటు చేసింది. డీజీపీ, సీసీఎల్‌ఏ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులను సభ్యులుగా, సీఐడీ అదనపు డీజీని కన్వీనర్‌గా నియమించింది. జప్తు చేసిన ఆస్తుల నుంచి వచ్చిన ఆదాయాన్ని బాధిత డిపాజిట్‌దారుల సంక్షేమానికి వెచ్చించనుంది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య […]

అగ్రిగోల్డ్‌ ఆస్తుల నుంచి ఆదాయార్జన..

విధాత‌ : అగ్రిగోల్డ్‌ సంస్థకు సంబంధించి ఇప్పటివరకు జప్తు చేసిన ఆస్తుల నుంచి ఆదాయం రాబట్టడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఆయా ఆస్తుల్ని అద్దె, లీజుకు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకునేందుకు సీఎస్‌ అధ్యక్షతన అధీకృత కమిటీని ఏర్పాటు చేసింది. డీజీపీ, సీసీఎల్‌ఏ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులను సభ్యులుగా, సీఐడీ అదనపు డీజీని కన్వీనర్‌గా నియమించింది. జప్తు చేసిన ఆస్తుల నుంచి వచ్చిన ఆదాయాన్ని బాధిత డిపాజిట్‌దారుల సంక్షేమానికి వెచ్చించనుంది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌విశ్వజిత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.