AP Assembly | జగన్‌.. రఘురామ మాటమంతి.. అసెంబ్లీ హాల్‌లో ఆసక్తికర ఘటన

గతంలో వైసీపీలో ఎంపీగా ఉండి మాజీ సీఎం వైఎస్‌.జగన్‌తో విభేదించి నిత్యం విమర్శలు చేసిన ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు జగన్‌ను పలకరించిన సన్నివేశం అందరిని ఆకర్షించింది

AP Assembly | జగన్‌.. రఘురామ మాటమంతి.. అసెంబ్లీ హాల్‌లో ఆసక్తికర ఘటన

విధాత, హైదరాబాద్ : గతంలో వైసీపీలో ఎంపీగా ఉండి మాజీ సీఎం వైఎస్‌.జగన్‌తో విభేదించి నిత్యం విమర్శలు చేసిన ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలి రోజు జగన్‌ను పలకరించిన సన్నివేశం అందరిని ఆకర్షించింది. అసెంబ్లీ హాల్‌లో జగన్ కనిపించిన వెంటనే పలకరించిన రఘురామకృష్ణంరాజు ప్రతిరోజు అసెంబ్లీకి రా.. ప్రతిపక్షం లేకపోతే ఎలా? అంటూ జగన్ చేతిలో చేయి వేసి మాట్లాడారు. అసెంబ్లీకి రెగ్యులర్ వస్తా.. మీరే చూస్తారుగా అని జగన్‌ బదులిచ్చారు.

అసెంబ్లీ హాల్‌లో జగన్‌ భుజంపై చేయి వేసి కాసేపు మాట్లాడారు. తనకు జగన్ పక్కనే సీట్ కేటాయించాలని పయ్యావుల కేశవ్‌ను రఘురామకృష్ణం రాజు కోరారు. తప్పని సరిగా అంటూ నవ్వుకుంటూ కేశవ్ ముందుకెళ్లారు. అటు రఘురామను పలకరించి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పలకరించారు. అనంతరం ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైఎస్‌ జగన్‌, టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు పక్కపక్కనే కూర్చుకున్నారు. కాసేపు ఇద్దరు సంభాషించుకున్నారు. జగన్‌ చెవిలో ఏదో చెబుతూ రఘురామ కనిపించారు. అయితే జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడే రఘురామ.. ఇప్పుడు ఆయన పక్కనే కూర్చోవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వారిద్దరు ఏం మాట్లాడుకున్నారనే విషయమై చర్చ జరుగుతున్నది.