టీడీపీకి మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి రాజీనామా

విధాత,విజయనగరం: టీడీపీకి మరో షాక్‌ తగిలింది.టీడీపీకి మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి రాజీనామా చేశారు. పార్టీలో తగిన గుర్తింపు లేదంటూ శోభా హైమావతి ఆవేదన చెందారు. పార్టీ కోసం కష్టపడుతున్నవారిని పక్కన పెడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. శోభా హైమావతి గతంలో ఎస్. కోట ఎమ్మెల్యేగా, తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న పరిణామాలను భరించలేక పార్టీని వీడుతున్నట్లు ఆమె ప్రకటించారు.