రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాద్యాయ,అధ్యాప‌కుల పోస్ట్ లను భర్తీ చేయండి

విధాత‌: రాష్ట్రంలో నాడు నేడు ద్వారా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మౌలిక సదుపాయాలు, వేల కోట్ల రూపాయలు అమ్మ వడి కోసం మరొక వైపు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది.కానీ దేశంలోనే చివరి స్థానంలో అక్షరాస్యత శాతం ఉంది. ఉన్నత విద్య లో కూడా ఎక్కడ అంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగు లో లేవు,టెక్నికల్ విద్యలో కూడా ప్రమాణాలు లేక ప్రయివేటు రంగంలో నియామకాలు లేక ఆంద్రప్రదేశ్ లో చదువుకున్న యువతకు విద్య ప్రమాణాలలో మెరుగైన ఫలితాలు […]

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాద్యాయ,అధ్యాప‌కుల పోస్ట్ లను భర్తీ చేయండి

విధాత‌: రాష్ట్రంలో నాడు నేడు ద్వారా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మౌలిక సదుపాయాలు, వేల కోట్ల రూపాయలు అమ్మ వడి కోసం మరొక వైపు ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది.కానీ దేశంలోనే చివరి స్థానంలో అక్షరాస్యత శాతం ఉంది. ఉన్నత విద్య లో కూడా ఎక్కడ అంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలకు ర్యాంకింగు లో లేవు,టెక్నికల్ విద్యలో కూడా ప్రమాణాలు లేక ప్రయివేటు రంగంలో నియామకాలు లేక ఆంద్రప్రదేశ్ లో చదువుకున్న యువతకు విద్య ప్రమాణాలలో మెరుగైన ఫలితాలు లేక ఉద్యోగాల నియామకం లేవు,ఇలా అన్ని విధాలా నష్టం జరగడానికి కారణం చదువు చెప్పే సిబ్బంది లేకపోవ‌డంతోనేన‌ని అందుకే రాష్ట్రం లో విద్య ప్రమాణాలు మెరుగు పడాలంటే నియామకాలు చేపట్టాలన్నారు రిజర్వేషన్ల పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు పోతుల నాగరాజు.

రిజర్వేషన్ల పరిరక్షణ సమితి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేయడం ఏమిటంటే ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్యలో దాదాపు 38 వేల ఉపాద్యాయ పోస్టులు ఖాళీ గా ఉన్నాయి, ఇంటర్,డిగ్రీ కాలేజీ లలో 15 వేల ఉద్యోగ పోస్ట్ లు ఖాళీగా ఉన్నాయి, యూనివర్సిటీలలో 4 వేల పోస్ట్ లు ఖాళీ గా ఉన్నాయి, ఇంజినీరింగ్ కాలేజీలలో 15 వందల పోస్ట్ లు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉంటే విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎక్కడ అందుతుందని కావునా ప్రభుత్వం ఆలోచన చేయాలని, అదే విధంగా వ్యాయామ ఉపాద్యాయుల పోస్ట్ లను ప్రతి హైస్కూలుకి ఇద్దరు PET లను నియమించాలని,ఇంటర్ ,డిగ్రీ, PG లలో కూడా PD పోస్ట్ లను భర్తీ చేసి విద్యార్థుల ను క్రీడాకారులుగా తయారు చేయాలని ఇప్పటికే కరోనా మహమ్మారి వల్ల విద్యార్థులు తమ అమూల్యమైన భవిష్యత్ ను కోల్పోయారని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెట్టాలనే నిర్ణయం కూడా రిజర్వేషన్ల పరిరక్షణ సమితి స్వాగతీస్తున్నది. ప్రభుత్వ పాఠశాలల్లో ఆడపిల్లల కు స్వేచ్ఛ కార్యక్రమం ద్వారా శానిటరీ న్యాప్ కిన్స్ ను అందచేయడాన్ని కూడా ఒక మంచి సామాజిక కార్యక్రమంగా భావించి ముఖ్యమంత్రికి అభినందినలు తెలుపుతూ ఆడపిల్లల తరుపున కృతజ్ఞతలు తెలియచేస్తూ ,నియామకాలు వెంటనే చేపట్టి విద్య కు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రతి సంవత్సరం ఉపాద్యాయుల నియామకం కోసం DSC నిర్వహించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నామని వెల్ల‌డించారు.