ఏపీలో 14 ఎమ్మెల్సీ స్థానాల భర్తీకి సన్నాహాలు
విధాత: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో 14 ఎమ్మెల్సీకి స్థానాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది స్థానిక సంస్థల నుండి 11 ,ఎమ్మెల్యేల కోట నుండి మరో 3 స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది.గత ఆరు నెలలుగా ఈ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.ప్రధానంగా స్థానిక సంస్థల కోటాకు సంబంధించి ఖాళీల భర్తీ నిన్నటి వరకు కోర్టు అడ్డంకి ఉండేదికోర్టు నుండి నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో కౌంటింగ్ పూర్తయి అన్ని జిల్లాలో ఎంపిపి,జెడ్పిటిసి స్థానాలు భర్తీ పూర్తి అయింది. […]

విధాత: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలిలో 14 ఎమ్మెల్సీకి స్థానాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది స్థానిక సంస్థల నుండి 11 ,ఎమ్మెల్యేల కోట నుండి మరో 3 స్థానాలు భర్తీ చేయాల్సి ఉంది.గత ఆరు నెలలుగా ఈ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.ప్రధానంగా స్థానిక సంస్థల కోటాకు సంబంధించి ఖాళీల భర్తీ నిన్నటి వరకు కోర్టు అడ్డంకి ఉండేదికోర్టు నుండి నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో కౌంటింగ్ పూర్తయి అన్ని జిల్లాలో ఎంపిపి,జెడ్పిటిసి స్థానాలు భర్తీ పూర్తి అయింది.
అయితే శాసనమండలిలో 58 స్థానాలు ఉండగా,అధికార వైకాపా పార్టీకి ఇప్పటికే 18 స్థానాలు ఉన్నాయి.ఖాళీగా ఉన్న 14 స్థానాలు భర్తీ చేస్తే అన్ని కూడా వైకాపా ఖాతాలో పడనున్నాయి.దింతో వైకాపా బలం మండలిలో పెరిగి చైర్మన్,వైస్ చైర్మన్ పదవులను సైతం కైవసం చేసుకోనుంది.అయితే ఖాళీగా ఉన్న 14 స్థానాల కోసం ఆయా జిల్లాలలో వైకాపా పార్టీ నేతలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.ఈ నేపథ్యంలో కొన్ని పేర్లను సీఎం జగన్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.బద్వేల్ ఉపఎన్నిక అనంతరం ఈ ఎమ్మెల్సీకి స్థానాలు భర్తీ చేయనున్నారు.