ఘంటసాల కుమారుడు రత్నకుమార్ ఇకలేరు

విధాత‌:మధురగాయకుడు ఘంటసాల కుమారుడు,రచయిత, డబ్బింగ్ కళాకారుడు రత్నకుమార్ (65)ఇకలేరు. ఈ ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఇటీవల కోవిడ్ బారినపడి కోలుకున్న ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా గుండెపోటు వచ్చింది. రత్నకుమార్ తెలుగు సహా తమిళ, మలయాళ, హిందీ, సంస్కృతం భాషల్లో సుమారు 1200 చిత్రాలకు గాత్రదానం చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనువాద (డబ్బింగ్) కళాకారులకు ప్రవేశపెట్టిన నంది పురస్కారాన్ని తొలిసారిగా (సురేష్ మూవీస్ తాతామనవడు) అందుకున్నారు.జాగ్రఫీ డిస్కవరీ ఛానల్ […]

ఘంటసాల కుమారుడు రత్నకుమార్ ఇకలేరు

విధాత‌:మధురగాయకుడు ఘంటసాల కుమారుడు,రచయిత, డబ్బింగ్ కళాకారుడు రత్నకుమార్ (65)ఇకలేరు. ఈ ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఇటీవల కోవిడ్ బారినపడి కోలుకున్న ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా గుండెపోటు వచ్చింది. రత్నకుమార్ తెలుగు సహా తమిళ, మలయాళ, హిందీ, సంస్కృతం భాషల్లో సుమారు 1200 చిత్రాలకు గాత్రదానం చేశారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనువాద (డబ్బింగ్) కళాకారులకు ప్రవేశపెట్టిన నంది పురస్కారాన్ని తొలిసారిగా (సురేష్ మూవీస్ తాతామనవడు) అందుకున్నారు.జాగ్రఫీ డిస్కవరీ ఛానల్ కు ఏకధాటిగా ఎనిమిదిన్నర గంటలు డబ్బింగ్ చెప్పి (హైదరాబాద్) ఎమేజింగ్ వరల్డ్ రికార్డ్స్, కెక్కారు. ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యారు. ఆయన కుమార్తె వీణ నేపథ్య గాయని, డబ్బింగ్ కళాకారిణి. డబ్బింగ్ కళాకారుడిగా…. చిన్నతనం నుంచే ఆకాశవాణి బాలల కార్యక్రమంలో పాల్గొన్నారు.