ఏచూరి కుమారుని మృతి పట్ల గవర్నర్ సంతాపం

కోవిడ్ -19 కారణంగా సిపిఎం జాతీయ నాయకుడు సీతారాం ఏచూరి కుమారుడు ఆశిష్ ఏచూరి అకాల మరణం చెందటం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంచి భవిష్యత్తుతో వెలుగొందవలసిన ఆశిష్ ఊహించని రీతిలో మృత్యువుకు చేరువయ్యారని గవర్నర్ శ్రీ హరిచందన్ ఆవేదన వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి కుటుంబ సభ్యులకు ఆయన హృదయ పూర్వక సంతాపం తెలిపారు. ఈ మేరకు రాజ్ […]

ఏచూరి కుమారుని మృతి పట్ల గవర్నర్ సంతాపం

కోవిడ్ -19 కారణంగా సిపిఎం జాతీయ నాయకుడు సీతారాం ఏచూరి కుమారుడు ఆశిష్ ఏచూరి అకాల మరణం చెందటం పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంచి భవిష్యత్తుతో వెలుగొందవలసిన ఆశిష్ ఊహించని రీతిలో మృత్యువుకు చేరువయ్యారని గవర్నర్ శ్రీ హరిచందన్ ఆవేదన వ్యక్తం చేశారు. సీతారాం ఏచూరి కుటుంబ సభ్యులకు ఆయన హృదయ పూర్వక సంతాపం తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.