సంపూర్ణ ఆరోగ్యంతో విజయవాడకు గవర్నర్

విధాత : కరొనా నుంచి పూర్తిగా కోలుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మంగళవారం మధ్యాహ్నం విజయ వాడ చేరుకోనున్నారని గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు. ఢిల్లీ పర్యటన తదుపరి కరోనా లక్షణాలు బయటపడటంతో ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో గవర్నర్ జాయిన్ అయ్యారు. మెరుగైన చికిత్సతో వేగంగా కోలుకున్న గవర్నర్ మంగళవారం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో […]

సంపూర్ణ ఆరోగ్యంతో విజయవాడకు గవర్నర్

విధాత : కరొనా నుంచి పూర్తిగా కోలుకున్న ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మంగళవారం మధ్యాహ్నం విజయ వాడ చేరుకోనున్నారని గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తెలిపారు.

ఢిల్లీ పర్యటన తదుపరి కరోనా లక్షణాలు బయటపడటంతో ఈ నెల 15వ తేదీన హైదరాబాద్ ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో గవర్నర్ జాయిన్ అయ్యారు.

మెరుగైన చికిత్సతో వేగంగా కోలుకున్న గవర్నర్ మంగళవారం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఒంటిగంటకు గన్నవరం విమానాశ్రాయానికి చేరుకుంటారు. షెడ్యూలును అనుసరించి 1.30 గంటలకు రాజ్ భవన్ వస్తారని సిసోడియా పేర్కొన్నారు.