16 చోట్ల హెల్త్ హబ్‌లు… ఒక్కో హబ్‌కు 50 ఎకరాలు: సి.యం. జగన్
విధాత:ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 16 చోట్ల హెల్త్ హబ్‌లను ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించారు. జిల్లా కేంద్రాలతో పాటు విజయవాడ, తిరుపతి, రాజమండ్రిలతో కలిపి మొత్తం 16 చోట్ల హెల్త్ హబ్‌లు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఒక్కో హెల్త్ హబ్‌కు 30-50 ఎకరాలు సేకరించాలని.. హెల్త్ హబ్‌లో ఒక్కో ఆసుపత్రికి 5 ఎకరాలు కేటాయించాలని జగన్ సూచించారు. మూడేళ్లలో కనీసం 100 కోట్లు పెట్టబడి పెట్టే […]

విధాత:ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 16 చోట్ల హెల్త్ హబ్‌లను ఏర్పాటు చేయాలని ఆయన నిర్ణయించారు. జిల్లా కేంద్రాలతో పాటు విజయవాడ, తిరుపతి, రాజమండ్రిలతో కలిపి మొత్తం 16 చోట్ల హెల్త్ హబ్‌లు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఒక్కో హెల్త్ హబ్‌కు 30-50 ఎకరాలు సేకరించాలని.. హెల్త్ హబ్‌లో ఒక్కో ఆసుపత్రికి 5 ఎకరాలు కేటాయించాలని జగన్ సూచించారు. మూడేళ్లలో కనీసం 100 కోట్లు పెట్టబడి పెట్టే ఆసుపత్రులకు భూములు కేటాయించాలని సీఎం ఆదేశించారు.
హెల్త్ హబ్‌ల వల్ల ఏపీకి 80 మల్టీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వస్తాయని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తరపున కొత్తగా 16 మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తామన్నారు.