అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం జగన్ అండగా నిలిచారు

విధాత‌: ప్రైవేట్ సంస్థ బాధితులకు న్యాయం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేదని, గతంలో 300 మంది అగ్రిగోల్డ్‌ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు హోంమంత్రి సుచరిత. అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం జగన్ అండగా నిలిచారని తెలిపారు. రూ.20వేల లోపు డిపాజిటర్ల ఖాతాల్లో రూ.666.84 కోట్ల నగదు జమ చేస్తున్నారని, ఇప్పటికే రూ.10వేలలోపు డిపాజిటర్లకు రూ.238.73 కోట్లు చెల్లించారని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల్లో బాధితులకు ఇప్పటివరకు న్యాయం జరగలేదన్నారు. దశ కింద రూ.10 వేల నుంచి రూ.20వేల లోపు […]

అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం జగన్ అండగా నిలిచారు

విధాత‌: ప్రైవేట్ సంస్థ బాధితులకు న్యాయం చేసిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేదని, గతంలో 300 మంది అగ్రిగోల్డ్‌ బాధితులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు హోంమంత్రి సుచరిత.

అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం జగన్ అండగా నిలిచారని తెలిపారు. రూ.20వేల లోపు డిపాజిటర్ల ఖాతాల్లో రూ.666.84 కోట్ల నగదు జమ చేస్తున్నారని, ఇప్పటికే రూ.10వేలలోపు డిపాజిటర్లకు రూ.238.73 కోట్లు చెల్లించారని పేర్కొన్నారు.

ఇతర రాష్ట్రాల్లో బాధితులకు ఇప్పటివరకు న్యాయం జరగలేదన్నారు. దశ కింద రూ.10 వేల నుంచి రూ.20వేల లోపు 7 లక్షల మంది డిపాజిట్‌దారులకు రూ.666.84 కోట్లను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.మొదటి దశలో రూ.10 వేల లోపు డిపాజిట్‌దారులైన 3.40 లక్షల మందికి 2019లోనే రూ.238.73 కోట్లను పంపిణీ చేసిన విషయం తెలిసిందే.మొదటి, రెండో దశలో కలిపి మొత్తం 10.40 లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రభుత్వం రూ.905.57 కోట్లు పంపిణీ చేసినట్లు అయింది.