సీఎం జగన్‌కి కళా వెంకట్రావు బహిరంగ లేఖ
అమరావతి: సీఎం జగన్‌కు టీడీపీ నేత కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. 11 చార్జ్‌షీట్లలో నిందితులుగా ఉన్న మీరు బెయిల్ పొందారంటే మీరు న్యాయస్థానాలను మేనేజ్ చేసినట్లేనా అని వెంకట్రావు ప్రశ్నలు సంధించారు. వివేకాను గొడ్డలితో నరికి చంపితే వారి కుమార్తె న్యాయంస్థానం తలుపులు తట్ట కూడదా అని ప్రభుత్వాన్ని కళా నిలదీశారు. అది పరిపాలనకు అడ్డుపడటం ఎలా అవుతుందో చెప్పాలని వెంకట్రావు డిమాండ్ చేశారు. డాక్టర్ సుధాకర్ కేసును సుమోటోగా తీసుకోవడం న్యాయవ్యవస్థ ప్రతిష్టకు […]

అమరావతి: సీఎం జగన్‌కు టీడీపీ నేత కళా వెంకట్రావు బహిరంగ లేఖ రాశారు. 11 చార్జ్‌షీట్లలో నిందితులుగా ఉన్న మీరు బెయిల్ పొందారంటే మీరు న్యాయస్థానాలను మేనేజ్ చేసినట్లేనా అని వెంకట్రావు ప్రశ్నలు సంధించారు. వివేకాను గొడ్డలితో నరికి చంపితే వారి కుమార్తె న్యాయంస్థానం తలుపులు తట్ట కూడదా అని ప్రభుత్వాన్ని కళా నిలదీశారు. అది పరిపాలనకు అడ్డుపడటం ఎలా అవుతుందో చెప్పాలని వెంకట్రావు డిమాండ్ చేశారు. డాక్టర్ సుధాకర్ కేసును సుమోటోగా తీసుకోవడం న్యాయవ్యవస్థ ప్రతిష్టకు భంగమా అని కళా ఆశ్యర్యం వ్యక్తం చేశారు. ఏపీ రాజధానుల కోసం భూములను త్యాగం చేసిన రైతులను నిండాముంచి రాజధానిని ముక్కలు చేస్తే కోర్టుకు చెప్పుకోకూడదా అని జగన్‌ను కళా వెంకట్రావు నిలదీశారు.