భాషా పరిరక్షణ ప్రజా ఉద్యమం కావాలి – ఉపరాష్ట్రపతి

మనుషులను భాష ఒక్కతాటిపైకి చేర్చుతోందని ఉపరాష్ట్రపతి,వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. ★ రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆరో వార్షికోత్సవంలో వర్చువల్‌గా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ★ భాషా పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాలని ఆకాంక్షించారు. విధాత:మనిషిని సంఘటితంగా కట్టి ఉంచే మొదటి గొలుసు మాతృభూమి అయితే రెండో గొలుసు భాష. అలాంటి భాషాసంస్కృతుల ద్వారా అందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం ముదావహం. మనుషులనే కాకుండా తరాలను సైతం కలిపి ఉంచే గొప్ప శక్తి భాష. భాషాభివృద్ధి […]

భాషా పరిరక్షణ ప్రజా ఉద్యమం కావాలి – ఉపరాష్ట్రపతి

మనుషులను భాష ఒక్కతాటిపైకి చేర్చుతోందని ఉపరాష్ట్రపతి,వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు.

★ రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆరో వార్షికోత్సవంలో వర్చువల్‌గా ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

★ భాషా పరిరక్షణ ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాలని ఆకాంక్షించారు.

విధాత:మనిషిని సంఘటితంగా కట్టి ఉంచే మొదటి గొలుసు మాతృభూమి అయితే రెండో గొలుసు భాష. అలాంటి భాషాసంస్కృతుల ద్వారా అందర్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం ముదావహం. మనుషులనే కాకుండా తరాలను సైతం కలిపి ఉంచే గొప్ప శక్తి భాష. భాషాభివృద్ధి కోసం ప్రభుత్వాలు తమ పని తాము నిర్వర్తిస్తున్నాయి.. అయితే అది చాలదు. భాషా పరిరక్షణ, భాషా వ్యాప్తి ప్రజా ఉద్యమంగా రూపుదాల్చినపుడు అది పదికాలాల పాటు పటిష్ఠంగా ఉంటుంది. ఆ అవసరం నేడు ఎంతో ఉంది’’ అని వెంకయ్య అన్నారు.