అవినీతి పరుల్ని వదిలి.. అవినీతి బయటపెడితే కేసులా.?

సోమిరెడ్డిపై కేసు నమోదు అత్యంత దుర్మార్గం విధాత:పరిపాలనాధికారం మూర్ఖుల చేతిలో ఉంటే.. అరాచకంతోనే రాజ్యమేలుతారని జగన్ రెడ్డి చర్యలతో మరోసారి స్పష్టమైంది. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఆనందయ్య తాపత్రయపడుతుంటే.. వైసీపీ నేతలు అందులోనూ అవినీతికి ప్రయత్నిస్తున్నారు. వారి అక్రమాలను, అవినీతిని ప్రశ్నించి, చేస్తున్న దోపిడీని ఆధారాలతో సహా బయట పెట్టినందుకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాలకు అక్రమ కేసు పెట్టడం దుర్మార్గం. అర్ధరాత్రి కేసు నమోదు చేయడంతోనే ఇది […]

అవినీతి పరుల్ని వదిలి.. అవినీతి బయటపెడితే కేసులా.?

సోమిరెడ్డిపై కేసు నమోదు అత్యంత దుర్మార్గం

విధాత:పరిపాలనాధికారం మూర్ఖుల చేతిలో ఉంటే.. అరాచకంతోనే రాజ్యమేలుతారని జగన్ రెడ్డి చర్యలతో మరోసారి స్పష్టమైంది. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఆనందయ్య తాపత్రయపడుతుంటే.. వైసీపీ నేతలు అందులోనూ అవినీతికి ప్రయత్నిస్తున్నారు. వారి అక్రమాలను, అవినీతిని ప్రశ్నించి, చేస్తున్న దోపిడీని ఆధారాలతో సహా బయట పెట్టినందుకు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అర్ధరాత్రి 12 గంటల 15 నిమిషాలకు అక్రమ కేసు పెట్టడం దుర్మార్గం. అర్ధరాత్రి కేసు నమోదు చేయడంతోనే ఇది అక్రమ కేసని, ఇందులో కుట్ర ఉందని స్పష్టమవుతోంది. అర్ధరాత్రి కేసులు, తెల్లవారు జాము కూల్చివేతలు వంటి మూర్ఖపు చర్యలతో జగన్ రెడ్డి రాష్ట్రాన్ని ప్రతీకార కుంపటిగా మార్చారు.

కక్షపూరిత వైఖరితో పేట్రేగిపోతున్నారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ.. పౌర హక్కుల్ని కూడా అణచివేస్తున్నారు. నకిలీ వెబ్ సైట్ రూపొందించి.. మందులు అమ్ముకునేందుకు ప్రయత్నించిన వారిని వదిలేసి.. అవినీతిని బట్టబయలు చేసిన సోమిరెడ్డిపై దొంగతనం, ఫోర్జరీ, చీటింగ్ అంటూ నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా.? ఆనందయ్య అనుమతి నిరాకరించినా దొడ్డిదారిన ఆన్ లైన్ అమ్మకాలకు ప్రయత్నించిన శేశ్రిత టెక్నాలజీస్ సంస్థపై చర్యలేవి.? దొంగతనంగా వ్యాపారం చేసేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలపైనే ఐసీపీ సెక్షన్ 379 , 468, 506, ఐటీ యాక్ట్ 56 కింద కేసు పెట్టాలి. ఆనందయ్య మందు విషయంలో వైసీపీ నేతలు చేస్తున్నది ముమ్మాటికీ శవాలపై చిల్లర ఏరుకోవడమే. సోమిరెడ్డిపై పెట్టిన కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఆనందయ్య మందు పేరుతో వ్యాపారం చేయదలచిన వారిపై చర్యలు తీసుకోవాలి.

నారా చంద్రబాబు నాయుడు
(టీడీపీ జాతీయ అధ్యక్షులు)