Leopard | రైతులను భయపెడుతున్న చిరుత సంచారం
పొలం పనులకు వెళ్లే రైతులలో చిరుత పులి సంచారం భయాందోళనలు రేకేత్తించింది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పోలేపల్లి గ్రామ పంట పొలాల పరిసర ప్రాంతంలో కొన్ని రోజులుగా చిరుత పులి సంచారం స్థానిక రైతులను భయపెడుతుంది

విధాత : పొలం పనులకు వెళ్లే రైతులలో చిరుత పులి సంచారం భయాందోళనలు రేకేత్తించింది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పోలేపల్లి గ్రామ పంట పొలాల పరిసర ప్రాంతంలో కొన్ని రోజులుగా చిరుత పులి సంచారం స్థానిక రైతులను భయపెడుతుంది. తాజాగా రాములు అనే రైతులు తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిలన క్రమంలో చిరుత పులి కనిపించింది. తన సెల్‌ఫోన్‌లో చిరుతను వీడియో తీసి గ్రామస్తులకు చేరవేశాడు.
చిరుత గ్రామంలో, తమ పొలాల్లోకి ఎక్కడ వస్తుందోనన్న భయంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటున్నారు. నల్లమల చిరుతలు ఆహార వేటలో భాగంగా పొలాలు, గ్రామాల వైపు వస్తున్నాయని దీంతో తమతో పాటు పశు సంతతికి ప్రాణహానీ నెలకొందని వారు వాపోతున్నారు. అధికారులు తక్షణమే చిరుతను బంధించి తాము పొలం పనులు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.