బ‌హుజ‌నులంద‌రం ఏక‌మౌదాం

విధాత‌:విజయవాడ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యాలయంలో 18.7.2021న జరిగిన సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా హాజరైన బహుజన సంఘాల నాయకులతోపాటు, ఇదే విజయవాడలో 19.7.2021న హోటల్ అభిరామ్ ప్యాలెస్ లో జరిగిన దళిత వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొని "కుల, మత, దోపిడి, కబ్జా, దౌర్జన్యదారుల పార్టీలకు ప్రత్యామ్నాయంగా బహుజనులందరం ఏకమౌదాం" అంటూ ముఖ్యఅతిథి రాష్ట్ర అధ్యక్షులు అంపావతిని గోవిందు మాట్లాడుతూ తిరుగుబాటుతో కూడిన చైతన్యంతోనే బహుజనులకు రాజ్యాధికారం వస్తుందన్నారు. రాష్ట్రంలో […]

బ‌హుజ‌నులంద‌రం ఏక‌మౌదాం

విధాత‌:విజయవాడ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ కార్యాలయంలో 18.7.2021న జరిగిన సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా హాజరైన బహుజన సంఘాల నాయకులతోపాటు, ఇదే విజయవాడలో 19.7.2021న హోటల్ అభిరామ్ ప్యాలెస్ లో జరిగిన దళిత వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొని “కుల, మత, దోపిడి, కబ్జా, దౌర్జన్యదారుల పార్టీలకు ప్రత్యామ్నాయంగా బహుజనులందరం ఏకమౌదాం” అంటూ ముఖ్యఅతిథి రాష్ట్ర అధ్యక్షులు అంపావతిని గోవిందు మాట్లాడుతూ తిరుగుబాటుతో కూడిన చైతన్యంతోనే బహుజనులకు రాజ్యాధికారం వస్తుందన్నారు. రాష్ట్రంలో కొన్ని బీసీ సంఘాలు (కుల, మత, దోపిడీ, కబ్జా, దౌర్జన్యదారుల పార్టీలతో అంటకాగుతూ) చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం పోరాటాలు, ఉద్యమాలు చేస్తామని నమ్మపలుకుతున్నాయి. దీనివలన బీసీలకు ఎలాంటి ప్రయోజనం లభించకపోగా కాలం, శ్రమ వృధా కావడం ఖాయం.

ఎందుకంటే 70ఏండ్లుగా ఈ కుల, మత, దోపిడీ, కబ్జా, దౌర్జన్యదారుల పార్టీల ప్రభుత్వాలు ఇచ్చిందిలేదు, సచ్చిందిలేదు. ఒక వేళ చట్టసభల్లో రిజర్వేషన్లు లభించినా ప్రయోజనం మాత్రం అంతంత మాత్రమే. ఎందుకంటే ఇప్పటి దాకా రాజ్యాంగం ద్వారా ఎస్సీ, ఎస్టీలకు లభించిన సీట్లలో గెలిచిన ఎస్సీ, ఎస్టీ మిత్రులు కాని, బీసీ, మైనార్టీల ఓట్ల కోసం కుల, మత, దోపిడీ, కబ్జా, దౌర్జన్యదారుల పార్టీలు ఇచ్చిన ఒకటి, అర సీట్లలో గెలిచిన బీసీ, మైనార్టీ మిత్రులు కాని ఈ వర్గా(ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ)లకు ఏ సమస్యలు వచ్చినా, ఆ పార్టీల అధినేతలను కాదని ఇంత వరకు మాట్లాడిన సందర్భమే లేదు. అందువలన బీసీ, మైనార్టీలను మభ్యపెట్టేందుకు చేస్తున్న సంఘాలను పక్కన పెట్టి నిర్ణయాధికారం కలిగిన రాజ్యాధికారం సాధించేందుకు మాతో కలిసిరావాలని విజ్ఞప్తి చేస్తూ, ఒక వేళ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు “ప్రత్యేక హోదా” కోసం కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామనే విధంగా ఈ చట్టసభల రిజర్వేషన్లను కూడా అడుగుతూనే ఉందాం. కనుక కాలం, శ్రమ వృధా చేయకుండా బహుజన రాజ్యాధికారాన్ని సాధించుకొందాం. ఎందుకంటే గత 70ఏళ్ల నుంచి రాష్ట్రంలో కుల, మత, దోపిడి, కబ్జా, దౌర్జన్యదారుల పార్టీలు జనాభాలో 85శాతంపైన ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన బహుజనులకు మాయ మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని గెలిచి అధికారం చేపట్టిన తర్వాత ఒకటి, అర సంక్షేమ పథకాల పేరుతో బహుజనులకు ఎంగిలి మెతుకులు విసిరేసినట్టు విసిరేసి తను, తన కులపొలు, తన వర్గీయులు లక్షల కోట్లు దోచుకోవడం తోపాటు, రాష్ట్రంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులను ఏ కుల పార్టీ అధికారంలో ఉంటే ఆ కులపొల్లే ఆక్రమించుకొని అనుభవించడం జరుగుతావుంది. అలాగే ఓట్లు వేసిన బహుజనులపై యధేచ్చగా దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, అణచివేతలు, అవమానాలు, అత్యాచారాలు, హత్యలు, కుట్రలు, కుతంత్రాలు నిత్యము చేయడం జరుగుతావుంది. కాని పాలక కులాలవారు మాత్రం పైవాటికి ఏనాడు గురి కాలేదు. ఒక మాటలో చెప్పాలంటే బహుజనులు దేశంలో, రాష్ట్రంలో రెండవ పౌరులుగానే జీవిస్తున్నారు. అధికార, ప్రతిపక్షాలుగా ఉంటూ ప్రజల కోసమే పొట్లాడుతున్నాయనే విధంగా నటన చేస్తూనే 60:40 నిష్పత్తి ప్రకారం అధికారాన్ని, సౌకర్యాలను అనుభవిస్తూ బహుజనులను పచ్చిగా మోసం, దగా చేస్తున్నాయి. అదే విధంగా ఇవి (కుల, మత, దోపిడీ, కబ్జా, దౌర్జన్యదారుల పార్టీలు) అన్ని ఒకే బట్ట తాను ముక్కలు అనేవిధంగా కలిసి ఉన్నాయనేందుకు వందలు ఉదాహరణలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఓ రెండింటిని ప్రజల దృష్టికి తెస్తున్నాం.

తెలంగాణలో దిశ(ప్రియాంకరెడ్డి)ని అత్యాచారం చేసి, హత్య చేస్తే రెండు రాష్ట్రాల్లో కుల, మత, దోపిడీ, కబ్జా, దౌర్జన్యదారుల పార్టీలు, ఎల్లో మీడియా, బ్లూ మీడియా అంటూ ప్రతినిత్యము పొట్లాడుకొంటునట్లు నటిస్తున్న తమ నటనను పక్కన పెట్టి దాదాపు 12రోజుల పాటు 24గంటలు నిందితులను ఎన్ కౌంటర్ చేసేంత వరకు భీకరంగా పోరాటం చేసి, దిశ కుటుంబాన్ని కేంద్ర హోం సహాయమంత్రి కిషన్ రెడ్డి గారు, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, సినీనటులు చిరంజీవి గారు, బాలక్రిష్ణ గారు పరామర్శిస్తే, నిందితులను ఎన్ కౌంటర్ చేసినందున దిశ కుటుంబానికి న్యాయం జరిగిందని సీపీఐకి ఐదు దశాబ్దాలుగా న్యాయకత్వం వహిస్తున్న నారాయణ గారు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు పత్రికా ముఖంగా పేర్కొన్నారు. ఇక గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారైతే తన రెడ్డి అమ్మాయిపై ఉన్న ప్రేమతో దిశ పేరుతో ఏకంగా చట్టాన్నే తెచ్చారు. కాని ఆ పక్కనే ఇంత కంటే ఘోరాతిఘోరంగా దళిత మహిళ టేకు లక్ష్మీని, బీసీ మహిళ మానస యాదవ్ లను అత్యాచారం చేసి, చంపితే వీరు ఎవరూ ఆవైపు కన్నెత్తి కూడా చూడలేదన్నారు.