కన్నీళ్ళే తప్పా తాగునీళ్ళు లేని ప్రాంతాలకూ ఇకపై సోమశిల నీళ్లు
అమరావతి:కన్నీళ్ళే తప్పా తాగునీళ్ళు లేని ప్రాంతాలకూ ఇకపై సోమశిల నీళ్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నీరు అందని పలు ప్రాంతాలకు కూడా సోమశిల ద్వారా నీరందించేందుకు ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేశాం ఉత్తర, దక్షిణ కాలువల ద్వారా 13 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి ద్వారా ప్రత్యేకంగా అనుమతి మంజూరైనట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు. కొత్తగా కొన్ని గ్రామాలను కలిపి ఉత్తర, దక్షిణ కాలువల విస్తరణ ద్వారా సోమశిల నీరందించేందుకు […]

అమరావతి:కన్నీళ్ళే తప్పా తాగునీళ్ళు లేని ప్రాంతాలకూ ఇకపై సోమశిల నీళ్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నీరు అందని పలు ప్రాంతాలకు కూడా సోమశిల ద్వారా నీరందించేందుకు ప్రత్యేక ప్రణాళిక ఏర్పాటు చేశాం ఉత్తర, దక్షిణ కాలువల ద్వారా 13 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి ద్వారా ప్రత్యేకంగా అనుమతి మంజూరైనట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు.
కొత్తగా కొన్ని గ్రామాలను కలిపి ఉత్తర, దక్షిణ కాలువల విస్తరణ ద్వారా సోమశిల నీరందించేందుకు అదనంగా రూ.100 కోట్లకు పైగా పనులకు సంబంధించి ముఖ్యమంత్రికి వివరించి అనుమతి పొందామని
ఇప్పటికే 13 ఎత్తిపోతల పథకాలకు హైడ్రోలాజికల్ అనుమతులు పూర్తయినట్లు సోమశిల ఎస్.ఈ తనకు వెల్లడించారన్నారు.
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డితో విజయవాడ క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైన సోమశిల ప్రాజెక్టు స్పెషల్ టాస్క్ ఫోర్స్.
1016 హెక్టార్ల రెవెన్యూ భూములను అటవీశాఖకు అప్పగించే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించగా అందుకు సంబంధించిన సీసీఎల్ఏ అనుమతుల కోసం ఇప్పటికే ఉత్తరం రాసినట్లు వెల్లడించిన నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) హరేంద్ర ప్రసాద్.
ఈ ప్రక్రియను నెలరోజుల్లోగా పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించిన మంత్రి మేకపాటి
హైలెవెల్ కెనాల్ ఫేజ్ -1 లో భాగంగా ఆర్ అండ్ ఆర్, భూ సేకరణ పనులు, చుక్కల భూముల పరిష్కారాలు జులై 5వ తేదీ లోగా పూర్తి చేయాలని ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కి మంత్రి ఆదేశం హైలెవల్ కెనాల్ ఫేజ్ -2 సర్వే పనులు ప్రస్తుతం ఆర్డీవో చైత్ర వర్షిణి ఆధ్వర్యంలో జరుగుతున్నాయని మంత్రికి వివరించిన జేసీ.అనంతరం హైలెవల్ కెనాల్ ఫేజ్- 2కి సంబంధించి 3100 ఎకరాలకు వీలైనంత త్వరగా పీఎన్ (ప్రిలిమినరీ నోటిఫికేషన్) ఇచ్చేందుకు దిశానిర్దేశం.సోమశిల ప్రాజెక్టులో భాగంగా అటవీ శాఖకు చెల్లించవలసిన చెల్లింపుల అంశాన్ని స్వయంగా పర్యవేక్షిస్తానని వెల్లడించిన మంత్రి మేకపాటి
ఆత్మకూరు ఆర్డీవో చైత్రవర్షిణిని ఆర్ అండ్ ఆర్ అధికారిగా నియమించినట్లు మంత్రికి వెల్లడించిన నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. తెలుగుగంగ ప్రాజెక్టు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శిక్షణలో ఆత్మకూరు ఆర్డీవో సహా పలువురు అధికారుల బృందంతో సోషియో ఎకనమిక్ సర్వే సహా ఆర్ అండ్ ఆర్, డోర్ టు డోర్ సర్వే పనుల పూర్తికి ఆదేశం.ప్రాజెక్టు పనులు, భూ సేకరణ పనులకు సమయాన్ని నిర్దేశించుకుని అంచెలంచెలుగా లక్ష్యాన్ని పూర్తి చేస్తూ వెళ్లాలని మంత్రి సూచన.మంత్రి ఆదేశాల మేరకు ఆర్ అండ్ ఆర్, భూసేకరణ పనులను జులై 10 కల్లా పూర్తి చేసేందుకు కృషి చేస్తామని జాయింట్ కలెక్టర్ వెల్లడి.ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్ పేట మండలంలో నష్టపరిహారానికి సంబంధించి 7 గ్రామాలకు గానూ 6 గ్రామాలకు ఖరారు చేసినట్లు వెల్లడి, మిగిలిన చిరమన గ్రామానికి కూడా జులై 4 కల్లా నష్టపరిహారాన్ని నిర్ణయిస్తామని జేసీ సమాధానం.సోమశిల ప్రాజెక్టుపై సమీక్ష అనంతరం నియోజకవర్గంలోని పంచాయతీ రాజ్ శాఖకి చెందిన కీలక అంశాలపైనా అధికారులతో చర్చించిన మంత్రి.స్థానిక పంచాయతీ ముఖ్య పనులను త్వరగా పూర్తి చేస్తామని మంత్రికి తెలిపిన జేసీ.గృహనిర్మాణ సైట్ లకు సంబంధించి ఎంపీడీవోలు, తహశీల్దార్లు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరిశీలిస్తున్నారని, ఆర్డీవోని కలిసి పురోగతి గురించి చెబుతున్నట్లు వెల్లడించిన పంచాయతీ రాజ్ శాఖ ఆత్మకూరు డీఈఈ
ప్రారంభం కాని సైట్ పనులను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు వెల్లడి.బిల్లుల చెల్లింపులకు సంబంధించిన అప్ లోడింగ్ వ్యవహారంలో జాప్యంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం మిగతా జిల్లాల్లో ఈ సమస్యే లేదని, ఎందుకు మన జిల్లాలో ఈ పరిస్థితి ఉందో చెప్పాలని అధికారులను ప్రశ్నించిన మంత్రి
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, శ్రీకాకుళం జిల్లాల్లో సాంకేతిక కారణాల వల్లే ఈ పరిస్థితికి కారణమని మంత్రికి వివరించిన జాయింట్ కలెక్టర్.డిడబ్ల్యూఎంఏ, ప్రాజెక్టు డైరెక్టర్, పంచాయతీ రాజ్ శాఖ ఎస్.ఈ లు సమన్వయంతో చేపట్టిన పనుల పూర్తి, బిల్లుల అప్ లోడింగ్ సహా ఇతర కీలక అంశాలు జాప్యం లేకుండా చూడాలన్న మంత్రి మేకపాటి.ఏరోజుకారోజు బిల్లుల అప్ లోడింగ్ ప్రక్రియను మానిటరింగ్ చేయాలని జేసీకి ఆదేశం,ప్రభుత్వం నిర్ణయించిన స్టీల్ రేట్, మార్కెట్ లో దొరుకుతున్న స్టీల్ ధరలలో తేడాలను మంత్రి దృష్టికి తీసుకువచ్చిన పంచాయతీ రాజ్ శాఖ డీఈ.దీనిపై తగిన చర్యలు తీసుకోవడానికి పూర్తి వివరాలు అందించాలని డీఈకి తెలిపిన మంత్రి మేకపాటి.
సమావేశానికి హాజరైన నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జిల్లా అటవీ శాఖ అధికారి ఎ.నాగేంద్ర, నెల్లూరు జిల్లా జలవనరుల శాఖ కు చెందిన సూపరింటెండింగ్ ఇంజనీర్ కృష్ణా రావు, తెలుగుగంగ ప్రాజెక్టు స్పెషల్ డిప్యుటి కలెక్టర్, డీడబ్ల్యూఎంఏ ప్రాజెక్ట్ డైరెక్టర్, జిల్లా పంచాయతీ రాజ్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్, ఆత్మకూరు ఆర్డీవో చైత్ర వర్షిణి, నెల్లూరు జిల్లా పంచాయతీ రాజ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఆత్మకూరు డివిజన్, మండల స్థాయి అధికారులు, తదితరులు..
Readmore:రాయలసీమవి అక్రమ ప్రాజెక్టులైతే ? తెలంగాణవి సక్రమ ప్రాజెక్టులా ?