విధాత:గ్రామాల్లో కోవిడ్ -19 నియంత్రణ కోసం ఆశా కార్యకర్తలు, ఏ ఎన్ ఎం లు ఎంతో శ్రమిస్తున్నారని, వారు మరింత బాధ్యతగా సేవా దృక్పథంతో పనిచేయాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) సూచించారు.ఆదివారం సాయంత్రం ఆయన స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహ ఆవరణలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మచిలీపట్నం మండల పరిధిలోని అన్ని గ్రామాల ఆశా కార్యకర్తలకు, ఏ ఎన్ […]
విధాత:గ్రామాల్లో కోవిడ్ -19 నియంత్రణ కోసం ఆశా కార్యకర్తలు, ఏ ఎన్ ఎం లు ఎంతో శ్రమిస్తున్నారని, వారు మరింత బాధ్యతగా సేవా దృక్పథంతో పనిచేయాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) సూచించారు.
ఆదివారం సాయంత్రం ఆయన స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహ ఆవరణలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మచిలీపట్నం మండల పరిధిలోని అన్ని గ్రామాల ఆశా కార్యకర్తలకు, ఏ ఎన్ ఎం లకు పల్స్ ఆక్సిమీటర్లు, చేతి తొడుగులు మంత్రి పేర్ని నాని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, జ్వర బాధితులు గుర్తించి ప్రభుత్వ కార్యక్రమంను విజయవంతం చేయాలని చేతులు జోడించి మిమ్ములను కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ శర్మిష్ట, డ్వామా పి డి , మచిలీపట్నం ఎం పి డి ఓ సూర్యనారాయణ, ముడా విసి కె. నారాయణ రెడ్డి, మునిసిపల్ కమీషనర్ శివరామకృష్ణ మచిలీపట్నం తహసీల్దార్ సునీల్ బాబు, చిన్నాపురం, తాళ్ళపాలెం ప్రాధమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ శ్రీహరి, డాక్టర్ షాహినా, డాక్టర్ నాగ విమల తదితరులు పాల్గొన్నారు.
ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందచేసిన మచిలీపట్నం సిటీ కేబుల్
ప్రభుత్వాసుపత్రిలో ప్రాణ వాయువు అందకుండా ఏ ఒక్కరూ ఉండకూడదని తమ ఉదారమైన మనస్సుతో మచిలీపట్నం సిటీ కేబుల్ ఎంతో ఆక్సిజన్ కాన్సెంట్రటర్లు అందచేయడం ఎంతో అభినందనీయమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ప్రశంసించారు.
ఆర్ అండ్ బి అతిధి గృహంలో జరిగిన మరో కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా రోగుల ప్రాణాన్ని నిలిపే ఎంతో కీలకమైన ఈ పరికరం ఎవరైనా దాతలు దయతో అందచేయాలని తాను ఇటీవల కోరానని ఈ అభ్యర్థనకు స్పందించిన సిటీ కేబుల్ ఎం డి కొల్లు శ్రీనివాసరావు 5 , ఆయన స్నేహితులు భీమవరం కమ్యూనికేషన్స్ లిమిటెడ్ నిర్వహిస్తున్న రాజు మరో 5 ఆక్సిజన్ కాన్సెంట్రటర్లు మానవత్వంతో అందచేయడం ఎంతో అభినందనీయమన్నారు. ఒకొక్క ఆక్సిజన్ కాన్సెంట్రటర్ 1 లక్షా 40 వేలు ఖరీదు చేస్తుందన్నారు. నిమిషానికి 10 లీటర్ల ఆక్సిజన్ ను ఈ పరికరం ఉత్పత్తి చేస్తుందన్నారు.. ఈ ఆక్సిజన్ కాన్సెంట్రటర్ లో మరో సౌలభ్యం ఏమిటంటే , ఇద్దరికి ఐదు లీటర్ల ఆక్సిజన్ ను ఏక కాలంలో సరఫరా చేయవచ్చని మంత్రి పేర్ని నాని అన్నారు