ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులపై జగన్‌కు రఘురామ లేఖ
విధాత: ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులపై ఏపీ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. వైసీపీ రంగులను పోలిన రంగులను వేయాలన్న మీ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిందన్నారు. మన కేసులు వాదించేందుకు సీనియర్ న్యాయవాదుల కోసం.. ప్రజాధనాన్ని ఖర్చు చేయడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని రఘురామ వెల్లడించారు. రంగుల కోసం ఎంత ఖర్చు పెట్టామో ప్రజలకు చెప్పడం ద్వారా.. దుబారా ఖర్చు చేయడం […]

విధాత: ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులపై ఏపీ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామ కృష్ణరాజు లేఖ రాశారు. వైసీపీ రంగులను పోలిన రంగులను వేయాలన్న మీ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసిందన్నారు. మన కేసులు వాదించేందుకు సీనియర్ న్యాయవాదుల కోసం.. ప్రజాధనాన్ని ఖర్చు చేయడంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని రఘురామ వెల్లడించారు. రంగుల కోసం ఎంత ఖర్చు పెట్టామో ప్రజలకు చెప్పడం ద్వారా.. దుబారా ఖర్చు చేయడం లేదని ప్రజలకు చెప్పవచ్చన్నారు. మనం రంగులు మార్చిన ప్రభుత్వ భవనాలను పాత రంగుల్లోకి తీసుకొచ్చి.. సుప్రీం తీర్పు పట్ల మీ గౌరవాన్ని వెల్లడించుకోవాలని కోరుతున్నానని లేఖలో రఘురామ పేర్కొన్నారు.