ముద్రగడ పద్మనాభం పేరు మార్పుపై గెజిట్ నోటిఫికేషన్‌

వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేరు మార్పుపై ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని ఎన్నికల సమయంలో ముద్రగడ సవాల్ విసిరారు

ముద్రగడ పద్మనాభం పేరు మార్పుపై గెజిట్ నోటిఫికేషన్‌

విధాత: వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పేరు మార్పుపై ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని ఎన్నికల సమయంలో ముద్రగడ సవాల్ విసిరారు.

పవన్ గెలిచిన నేపథ్యంలో తన పేరును మార్చుకుంటానని.. గెజిట్ దరఖాస్తు పెట్టుకుంటానని తెలిపారు. అన్న మాట మేరకు దరఖాస్తు చేసుకున్నందున ఆయన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.