రామోజీ తార, సితార హోటెళ్ళలో విదేశీ మద్యం అమ్మవచ్చా..? టూరిజం ప్రాంతాల్లో అమ్మితే తప్పా..?

టీడీపీ హయాంలో దేవాలయాలు, స్కూళ్లు పక్కన మద్యం అమ్మించింది నిజం కాదా? మద్యం నియంత్రణలో భాగంగానే 43వేల బెల్టు షాపులు, మద్యం పర్మిట్ రూములను రద్దు చేశాం, మద్యం షాపులు, బార్ల సంఖ్య తగ్గించాం టూరిజంను రాజకీయాలతో ముడి పెట్టవద్దు.. ప్రతిదాన్నీ రాజకీయం చేయడం ఇకనైనా మానుకోవాలి. విజయవాడ:మంత్రి శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని టూరిజం ప్రాంతాల్లో రెస్టారెంట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ విదేశీ టూరిస్టుల కోసం మద్యం అందుబాటులో ఉంటుంది. దానిని ఓ వర్గం […]

రామోజీ తార, సితార హోటెళ్ళలో విదేశీ మద్యం అమ్మవచ్చా..? టూరిజం ప్రాంతాల్లో అమ్మితే తప్పా..?
  • టీడీపీ హయాంలో దేవాలయాలు, స్కూళ్లు పక్కన మద్యం అమ్మించింది నిజం కాదా?
  • మద్యం నియంత్రణలో భాగంగానే 43వేల బెల్టు షాపులు, మద్యం పర్మిట్ రూములను రద్దు చేశాం, మద్యం షాపులు, బార్ల సంఖ్య తగ్గించాం
  • టూరిజంను రాజకీయాలతో ముడి పెట్టవద్దు.. ప్రతిదాన్నీ రాజకీయం చేయడం ఇకనైనా మానుకోవాలి.

విజయవాడ:మంత్రి శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని టూరిజం ప్రాంతాల్లో రెస్టారెంట్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ విదేశీ టూరిస్టుల కోసం మద్యం అందుబాటులో ఉంటుంది. దానిని ఓ వర్గం మీడియా, ఇవాళ ఈ ప్రభుత్వమే ఈ విధానాన్ని కొత్తగా తీసుకొచ్చినట్లు, మద్యాన్ని తామే అందుబాటులో ఉంచుతున్నట్టు కథనాలు రాశాయి. టూరిజం ను ప్రమోట్ చేయడానికే మద్యం గానీ.. మద్యాన్ని ప్రమోట్ చేయడానికి టూరిజం కాదు. మీడియా ఈ విషయాలను గ్రహించాలి.

ఈ ప్రభుత్వం దశల వారీగా మద్యపాన నియంత్రణకు కట్టుబడి ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో టూరిజం ప్రమోషన్ లో భాగంగా.. పర్యాటక ప్రాంతాల్లో ఎక్కడైతే రెస్టారెంట్లు ఉంటాయో అక్కడ విదేశీ మద్యం అందుబాటులో ఉంటుంది అని మాత్రమే మేం చెప్పాం. ఈనాడు గ్రూపు అధినేత రామోజీరావు గారు కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో తార, సితార హోటెళ్ళు, విశాఖలోని డాల్ఫిన్ హోటెళ్ళు నడిపిస్తున్నారు. అక్కడ కూడా టూరిస్టుల కోసం మద్యం అందుబాటులో ఉంటుంది. మరి, దాన్నేమంటారు..!?అయితే, టీడీపీ, చంద్రబాబు మేము ఏదో మద్యాన్ని ప్రమోట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. చంద్రబాబు మఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఊరూరా మద్యం బెల్టు షాపులను ఏర్పాటు చేసి, ఆఖరికి పార్టీ కార్యకర్తలను పెట్టి మద్యం అమ్మించాడు. ఇంటింటికీ డోర్ డెలివరీ ఏర్పాట్లు చేశాడు.

మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏకంగా 43 వేల బెల్ట్ షాపులు మూసేశాం. మద్యం పర్మిట్ రూములను రద్దు చేశాం. మద్యం షాపులను, బార్ల సంఖ్యను తగ్గించాం. మద్య నియంత్రణ కోసం దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ముఖ్యమంత్రి జగన్ గారు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారు.చంద్రబాబు, లోకేష్ మోకాలికి, బోడిగుండుకు ముడిపెట్టి ప్రజల్లో అపోహలు సృష్టించడం మంచిది కాదు. ఊరూరా బెల్టు షాపులు పెట్టించి మద్యం అమ్మించిన చంద్రబాబు మద్యం గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. ఆఖరికి దేవాలయాలు, బడులు పక్కన కూడా మద్యం అమ్మించిన ఘనుడు చంద్రబాబు.

కరోనా కాలంలో ఈ 15 నెలలు రాష్ట్రంలో ప్రజలు ఏమయ్యారు.. అని కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. హైదరాబాద్ లో కూర్చుని జూమ్ మీటింగ్ లు పెట్టుకుంటూ దాన్ని తనకు వత్తాసు పలికే మీడియాలో రాయించుకుని ఆనందపడుతున్నారు. లేనిది ఉన్నట్టు.. ఉన్నది లేనట్టు చేయడం, మాయ, మశ్చీంద్రలుగా మాట్లాడటం చంద్రబాబుకు బాగా అలవాటు. చెప్పింది చెప్పినట్టు చేయడం ముఖ్యమంత్రి జగన్ గారికి అలవాటు. నూతనంగా తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుని రాష్ట్రంలో పెద్దఎత్తున వ్యాక్సిన్లు వేయిస్తే.. దాన్ని సినీ నటుడు చిరంజీవి తదితర ప్రముఖులు సైతం అభినందిస్తుంటే.. దాన్నీ రాజకీయం చేస్తారా..? ఇటువంటి పనికి మాలిన రాజకీయాలు మానుకోవాలని చంద్రబాబు, లోకేష్ కు హితవు చెబుుతన్నా. కరోనా నుంచి బయట పడాలంటే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్లు ఇవ్వాలి. అందులో భాగంగానే కరోనాను నియంత్రించేందుకు ముఖ్యమంత్రి గారు అన్ని చర్యలు చేపడుతున్నారు. ఈరోజు దేశంలోనే అత్యధిక టెస్టులు చేసిన రాష్ట్రంగా, వ్యాక్సిన్లు వేసిన రాష్ట్రంగా ఏపీ ఉంది. ఇది సమిష్టి కృషి అని ముఖ్యమంత్రి గారు చెప్పారు.

కేరళ జీడీపీలో 14 శాతం టూరిజం నుంచే వస్తుంది. మన రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. 64 శాతం ఆదాయం వ్యవసాయం నుంచే వస్తుంది. వ్యవసాయరంగంతోపాటు టూరిజం పెంచాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అలా అని మద్యాన్ని ప్రోత్సహించాలని కాదు. టూరిజం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంటే.. ఎల్లో మీడియా వక్రభాష్యాలు ఇవ్వొద్దు. మీరు అదే వ్యాపారంలో ఉన్నారు. మీరు చేస్తేనే మో ఒప్పు.. టూరిజం శాఖ చేస్తే తప్పా..?
టూరిజం నుంచి వచ్చే ప్రతి రూపాయి బయటకు ఎక్కడికో పోవడం లేదు. ప్రజల కోసమే ఖర్చు చేస్తున్నాం. టూరిజం ను రాజకీయాలతో ముడి పెట్టవద్దు. ప్రతిదాన్ని రాజకీయం చేయడం టీడీపీ, ఎల్లో మీడియా ఇకనైనా మానుకోవాలి.