Nagarjunasagar gates open| నాగార్జునసాగర్ 26 గేట్లు ఎత్తివేత..!

ఎగువన జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద నీటితో నాగార్జున సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో అధికారులు ప్రాజెక్టు మొత్తం 26 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు.

Nagarjunasagar gates open| నాగార్జునసాగర్ 26 గేట్లు ఎత్తివేత..!

విధాత : నాగార్జున సాగర్ ప్రాజెక్టు 26గేట్లను అధికారులు ఈ సీజన్ లో మరోసారి ఎత్తారు. ఎగువన జూరాల, శ్రీశైలం ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద నీటితో నాగార్జున సాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో అధికారులు ప్రాజెక్టు మొత్తం 26 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. సాగర్ క్రస్ట్ గేట్ల నుంచి కృష్ణవేణి పరవళ్లు పాలనురుగల వలే జాలువారుతూ పులిచింతల ప్రాజెక్టులోకి దూసుకపోతుంది.

తరలివస్తున్న పర్యాటకులు

ఆదివారం కావడంతో నాగార్జునసాగర్ జలాశయం క్రస్ట్ గేట్ల నుంచి పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ సోయగాలను తిలకించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో సాగర్ జలాశయం పరిసరాలు, రోడ్లు వాహనాల రద్ధీతో కిటకిటలాడాయి. అటు నాగార్జున సాగర్ నుంచి వస్తున్న వరద నీటితో మరోసారి పులిచింతల గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటి విడుల చేస్తున్నారు. దీంతో కృష్ణమ్మ ప్రకాశం బ్యారేజీ వైపుకు వడివడిగా పరవళ్లు తొక్కుతుంది.

ఒకరి గల్లంతు

నాగార్జున సాగర్ చూడ్డానికి తన భార్య పిల్లలతో కలిసి వచ్చిన రాంబాబు అనే వ్యక్తి నదిలోకి దిగి వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు. రాంబాబు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.