చెత్తపైనా పన్నులేసిన చెత్త ప్రభుత్వంపై ప్రజాగ్రహం
మాయమాటల మాయలఫకీరు జగన్ నమ్మిన ప్రజల్ని నట్టేట ముంచారు వచ్చేది టిడిపి సర్కారు..రాజారెడ్డి రాజ్యాంగం అమలుచేసే అధికారుల సంగతి తేలుస్తాం విగ్రహావిష్కరణ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ విధాత:చివరికి చెత్తపైనా యూజర్‌చార్జీల పేరుతో పన్నులేసిన జగన్ చెత్త ప్రభుత్వంపై జనమంతా ఆగ్రహంగా వున్నారని, 2024లో వచ్చేది మన ప్రభుత్వమేనని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పెద్దాపురంలో అమరజీవి పొట్టి శ్రీరాములు, తెలుగుదేశం పార్టీ […]

- మాయమాటల మాయలఫకీరు జగన్ నమ్మిన ప్రజల్ని నట్టేట ముంచారు
- వచ్చేది టిడిపి సర్కారు..రాజారెడ్డి రాజ్యాంగం అమలుచేసే అధికారుల సంగతి తేలుస్తాం
- విగ్రహావిష్కరణ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్
విధాత:చివరికి చెత్తపైనా యూజర్‌చార్జీల పేరుతో పన్నులేసిన జగన్ చెత్త ప్రభుత్వంపై జనమంతా ఆగ్రహంగా వున్నారని, 2024లో వచ్చేది మన ప్రభుత్వమేనని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పెద్దాపురంలో అమరజీవి పొట్టి శ్రీరాములు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పొట్టిశ్రీరాములు ఆంధ్రజాతి కోసం తన ప్రాణాలనే త్యాగం చేశారన్నారు. ఆ మహనీయుని విగ్రహం ఆవిష్కరించడం తన అదృష్టమన్నారు. తెలుగోడి సత్తా దేశానికి చాటిచెప్పిన ఘనత ఎన్టీఆర్‌దేనన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అనతికాలంలోనే అధికారంలోకొచ్చి కిలో రూపాయి బియ్యం, ఆస్తుల్లో మహిళలకి సమానహక్కు, బడుగుబలహీనవర్గాలకు రాజకీయ అవకాశాలు వంటి ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలతో తెలుగుజాతి అభ్యున్నతికి పాటుపడ్డారన్నారు. మహానాయకుడు అన్న ఎన్టీఆర్ మనవడిగా కాకుండా ఆయన స్థాపించిన పార్టీ కార్యకర్తగా ఆయన ఆశయసాధనకి కృషి చేస్తానని ప్రతినబూనారు. కొందరు కుల,మత,ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి అధికారంలోకొచ్చారని, తెలుగుదేశం భూస్థాపితం అవుతుందంటున్నారని …తెలుగుదేశం పార్టీని టచ్ చేయడం వాళ్ల నాయనవల్లే కాలేదని, కొడుకు గెడ్డంలో వెంట్రుక కూడా పీకలేరన్నారు. 16వేల కోట్ల లోటుబడ్జెట్ తో, అన్యాయమైన రాష్ట్ర విభజనతో కష్టాల్లో వున్న రాష్ట్రం కోసం చంద్రబాబు అహర్నిశలు కష్టపడ్డారని, 2014 నుంచి 2019 వరకూ అభివృద్ధి-సంక్షేమంపై దృష్టి పెట్టి కార్యకర్తలకి దూరమయ్యామనే బాధ పార్టీ అధినాయకత్వంలో వుందని లోకేష్ వివరించారు. తెలుగుదేశం కుటుంబసభ్యులంటే కార్యకర్తలేనని, మీ వెనుక మేముంటామని, ప్రజల్ని చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. టిడిపి నాయకులు, కార్యకర్తల్ని అక్రమంగా-చట్టవ్యతిరేకంగా నిర్బంధిస్తూ…ఇబ్బందులకు గురిచేస్తోన్న రాజారెడ్డి రాజ్యాంగం అమలుచేస్తోన్న అధికారులకు..రానున్న తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో వడ్డీతో సహా చెల్లించే బాధ్యత తనదేనన్నారు. మాయలపకీరులాంటి జగన్‌రెడ్డి పాదయాత్రలో జనానికి మాయమాటలు చెప్పి అధికారంలోకొచ్చాడన్నారు. నాడు అన్నీ పెంచుతూ పోతానన్నాడు..నేడు క్వార్టర్ బాటిల్, సిమెంట్, విద్యుత్ చార్జీలు, నిత్యావసరాల ధరలన్నీ పెంచేశాడని విమర్శించారు. పెట్రోల్ డీజిల్ ధరలు జగన్ ట్యాక్స్‌ల దెబ్బకి డబుల్ సెంచరీ కొడతాయని ఎద్దేవ చేశారు. జగన్ రెండున్నరేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమా రాలేదు…ప్రత్యేకహోదా మాటే మరిచిపోయారన్నారు. 25 మంది ఎంపీల్ని గెలిపిస్తే ఢిల్లీని గడగడలాడిస్తామన్న జగన్‌రెడ్డి..22 మంది గెలిచినా ఢిల్లీ పెద్దల్ని గజగజ వణికిపోతున్నారన్నారు. మోడీ గారు కనిపిస్తే చాలు..కేసుల మాఫీ కోసం కాళ్లు పట్టుకుంటున్నారని ఆరోపించారు. నిర్వాసితులకు ఎకరాకి 10 లక్షల పరిహారం ఇస్తామని, నేడు వారిని నీట్లో ముంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పన్నులు పెంచేసి, చెత్తపైనా పన్నులేసిన చెత్త ప్రభుత్వం జగన్‌దేనన్నారు. అన్నా క్యాంటీన్లు, చంద్రన్నబీమా ఆపేశారు..అభివృద్ధి కార్యక్రమాలు లేవు.. రోడ్డుపై పడిన గుంతలు కూడా కప్పే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అరాచకపాలనపై పోరాడుదాం…ఎవ్వరూ భయపడొద్దు…అని పిలుపునిచ్చారు. ప్రజల్ని చైతన్యవంతంచేసి దుర్మార్గ జగన్‌రెడ్డి పాలనపై ఉద్యమించకపోతే, భవిష్యత్ తరాలూ నష్టపోతాయన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు తలచుకుంటే జగన్‌రెడ్డి బయట తిరిగేవారా? అని ప్రశ్నించారు. పెద్దాపురం నియోజకవర్గం అభివృద్ధిలో చినరాజప్పగారి కృషి ఎంతో ఉందన్నారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి గారిని ఉద్దేశించి మాట్లాడుతూ మా బుచ్చయ్య తాత
అంటూ …సభలో నవ్వులు కురిపించారు. సభలో లోకేష్ మాట్లాడుతున్నంత సేపూ…జనం జగన్ పన్నుల గురించి..ధరల గురించి…అధ్వాన్న రోడ్ల గురించి… చెత్త పరిపాలన గురించి కామెంట్లు చేస్తూనే వున్నారు.