మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలన్నీ మిస్టరీగానే మిగిలిపోతున్నాయ్..

విధాత‌: మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలన్నీ మిస్టరీగానే మిగిలిపోతున్నాయి. అత్యాచారాలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకోవడంలో అలసత్వం వహిస్తున్నారు. విశాఖ జిల్లా, గాజువాక ఏరియా అగనంపూడిలో బాలికపై అత్యాచారం చేసి క్రూరంగా చంపేసారనే అనుమానాలు బలపడుతున్నాయి. కుటుంబ సభ్యులు జరిగిన అన్యాయం గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నా, రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టం అవుతోంది. బతుకుతెరువు కోసం వలస వచ్చిన రజక కుటుంబానికి అన్యాయం జరిగితే నిందితులను కఠినంగా శిక్షించాల్సిన ప్రభుత్వ పెద్దలు […]

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలన్నీ మిస్టరీగానే మిగిలిపోతున్నాయ్..

విధాత‌: మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలన్నీ మిస్టరీగానే మిగిలిపోతున్నాయి. అత్యాచారాలకు పాల్పడుతున్న నిందితులను పట్టుకోవడంలో అలసత్వం వహిస్తున్నారు. విశాఖ జిల్లా, గాజువాక ఏరియా అగనంపూడిలో బాలికపై అత్యాచారం చేసి క్రూరంగా చంపేసారనే అనుమానాలు బలపడుతున్నాయి.

కుటుంబ సభ్యులు జరిగిన అన్యాయం గురించి ఆవేదన వ్యక్తం చేస్తున్నా, రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు కేసుని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టం అవుతోంది. బతుకుతెరువు కోసం వలస వచ్చిన రజక కుటుంబానికి అన్యాయం జరిగితే నిందితులను కఠినంగా శిక్షించాల్సిన ప్రభుత్వ పెద్దలు తప్పంతా బాలికదే అని చేతులు దులుపుకునే పనిలో నిమగ్నం అవ్వడం అన్యాయమ‌ని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో వెల్ల‌డించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.