గుంటూరుకి రానున్న జాతీయ ఎస్సీ కమిషన్ బృందం

విధాత‌: గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసుపై వాస్తవాలు తెలుసుకునేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ బృందం రాష్ట్రానికి రానుంది. జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షులు అరుణ్ హల్దర్, సభ్యులు అంజుబాల, సుభాష్ పార్థి గుంటూరుకు రానున్నట్లు జిల్లా అధికారులకు సమాచారం.ఈనెల 24వ తేది ఉదయం 11 గంటలకు రమ్య హత్య జరిగిన ప్రాంతాన్ని బృంద సభ్యులు పరిశీలిస్తారు.ఆ తర్వాత బాధిత కుటుంబసభ్యులను కలిసి మాట్లాడతారు.అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, […]

గుంటూరుకి రానున్న జాతీయ ఎస్సీ కమిషన్  బృందం

విధాత‌: గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసుపై వాస్తవాలు తెలుసుకునేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ బృందం రాష్ట్రానికి రానుంది. జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షులు అరుణ్ హల్దర్, సభ్యులు అంజుబాల, సుభాష్ పార్థి గుంటూరుకు రానున్నట్లు జిల్లా అధికారులకు సమాచారం.ఈనెల 24వ తేది ఉదయం 11 గంటలకు రమ్య హత్య జరిగిన ప్రాంతాన్ని బృంద సభ్యులు పరిశీలిస్తారు.ఆ తర్వాత బాధిత కుటుంబసభ్యులను కలిసి మాట్లాడతారు.అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ ఇతర ఉన్నతాధికారులతో సమావేశం.