తెలుగుదేశం రాకతో నూతన చరిత్ర మొదలైంది: చంద్రబాబు
విధాత ,అమరావతి: తెలుగు జాతీ అంటే దివంగత ఎన్టీ రామారావు గుర్తుకు వస్తారని, సమాజ హితం కోసం తెలుగుదేశం పనిచేస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. డిజిటల్ మహానాడు గురువారం ఉదయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం రాకతో నూతన చరిత్ర మొదలైందన్నారు. మే 28 యుగపురుషుడు ఎన్టీఆర్ పుట్టినరోజని, ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచారని, ప్రపంచంలోని ఏ మూలన చూసినా తెలుగువారు ఉన్నారన్నారు. సమస్యలపై ప్రజా చైతన్యం తీసుకొచ్చేలా ప్రతి […]

విధాత ,అమరావతి: తెలుగు జాతీ అంటే దివంగత ఎన్టీ రామారావు గుర్తుకు వస్తారని, సమాజ హితం కోసం తెలుగుదేశం పనిచేస్తోందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. డిజిటల్ మహానాడు గురువారం ఉదయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం రాకతో నూతన చరిత్ర మొదలైందన్నారు.
మే 28 యుగపురుషుడు ఎన్టీఆర్ పుట్టినరోజని, ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంచారని, ప్రపంచంలోని ఏ మూలన చూసినా తెలుగువారు ఉన్నారన్నారు. సమస్యలపై ప్రజా చైతన్యం తీసుకొచ్చేలా ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తలు పనిచేయాలని సూచించారు. సమాజహితం టీడీపీ ధ్యేయమని అన్నారు. కోవిడ్‌తో పెనుమార్పులు వస్తున్నాయని, కరోనాను ఎదుర్కొంటూ పోరాడాలని చంద్రబాబు పిలుపుఇచ్చారు.