ఏపీ లో ఆన్‌లైన్ లీగల్ కేస్ మానిటరింగ్ సిస్టం
విధాత: వివిధ శాఖలపై కోర్టుల్లో దాఖలయ్యే పిటిషన్లపై పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్‌లైన్ లీగల్ కేస్ మానిటరింగ్ సిస్టం పేరుతో ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు కార్యచరణ సైతం సిద్ధం చేసింది. దీనిలో భాగంగా పిటిషన్ల సత్వర పరిష్కారానికి ప్రతి విభాగంలో నోడల్ అధికారిని నియమించాలని భావిస్తోంది. అటు రాష్ట్ర వ్యవస్థ పర్యవేక్షణ ఐఏఎస్ అధికారికి అప్పగించాలని నిర్ణయించింది. ఏజీ, ప్రభుత్వ ప్లీడర్ల కార్యాలయాల్లో ఆటోమేషన్ వ్యవస్థ […]

విధాత: వివిధ శాఖలపై కోర్టుల్లో దాఖలయ్యే పిటిషన్లపై పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్‌లైన్ లీగల్ కేస్ మానిటరింగ్ సిస్టం పేరుతో ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు కార్యచరణ సైతం సిద్ధం చేసింది. దీనిలో భాగంగా పిటిషన్ల సత్వర పరిష్కారానికి ప్రతి విభాగంలో నోడల్ అధికారిని నియమించాలని భావిస్తోంది. అటు రాష్ట్ర వ్యవస్థ పర్యవేక్షణ ఐఏఎస్ అధికారికి అప్పగించాలని నిర్ణయించింది. ఏజీ, ప్రభుత్వ ప్లీడర్ల కార్యాలయాల్లో ఆటోమేషన్ వ్యవస్థ ఏర్పాటు చేసి.. అన్ని కేసుల వివరాలు రియల్‌టైమ్ డ్యాష్ బోర్డులో ఉంచాలని ప్రభుత్వంవ యోచిస్తోంది.