ANDRAPRDESH | మా భార్యలను కాపురానికి పంపించాలి..కలెక్టరేట్ వద్ద ఇద్దరు అల్లుళ్ల నిరాహార దీక్ష

పిల్లనిచ్చిన మామ మా భార్యలను కాపురానికి పంపించకుండా మమ్మల్లి ఇబ్బంది పెడుతున్నాడంటూ ఇద్దరు అల్లుళ్లు ఏలూరు కలెక్టరేట్ వద్ధ నిరాహార దీక్ష చేపట్టడం వైరల్‌గా మారింది.

ANDRAPRDESH | మా భార్యలను కాపురానికి పంపించాలి..కలెక్టరేట్ వద్ద ఇద్దరు అల్లుళ్ల నిరాహార దీక్ష

విధాత, హైదరాబాద్ : పిల్లనిచ్చిన మామ మా  కాపురానికి పంపించకుండా మమ్మల్లి ఇబ్బంది పెడుతున్నాడంటూ ఇద్దరు అల్లుళ్లు ఏలూరు కలెక్టరేట్ వద్ధ నిరాహార దీక్ష చేపట్టడం వైరల్‌గా మారింది. పెళ్లిళ్లు అయ్యాక ఇద్దరు కూతుళ్లను కాపురానికి పంపకుండా తమను ఇబ్బందుల పాలు చేస్తున్న తమ మామ బీకె. శ్రీనివాస రామానుజ అయ్యంగార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ వద్ద ఇధ్దరు అల్లుళ్లు నిరాహార దీక్ష చేపట్టారు. మా భార్యలను కాపురానికి పంపకపోగా, తిరిగి మాపై కేసులు పెట్టించాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మామ చేతిలో మోసపోయామంటూ ఇద్దరు అల్లుళ్లు స్థానిక కలక్టరేట్ వద్ద నిరాహార దీక్షకు దిగారు. ఎక్కడైనా భర్తల కోసం భార్యలు నిరాహార దీక్ష చేయడం చూశాంగాని భార్యలను కాపురాలకు పంపించాలంటూ భర్తలు నిరాహార దీక్షలకు దిగడం వింతగా ఉండటంతో ఈ వ్యవహారం కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.