దొంగతనాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టండి
అనంత పురం జిల్లాలో దొంగతనాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశించారు. రాత్రి వేళ గస్తీలు, పెట్రోలింగ్ లు తీవ్రం చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ , సర్కిల్ , సబ్ డివిజన్ మరియు జిల్లా నైట్ అలెర్టింగ్ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉంటూ నైట్ బీట్లు, పెట్రోలింగ్ బృందాలను పర్యవేక్షించాలన్నారు. వ్యాపార సముదాయాలు, బ్యాంకులు, ఏటిఎం కేంద్రాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రార్థనా మందిరాల వద్ద బందోబస్తు లేదా బీట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. […]

అనంత పురం జిల్లాలో దొంగతనాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశించారు. రాత్రి వేళ గస్తీలు, పెట్రోలింగ్ లు తీవ్రం చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ , సర్కిల్ , సబ్ డివిజన్ మరియు జిల్లా నైట్ అలెర్టింగ్ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉంటూ నైట్ బీట్లు, పెట్రోలింగ్ బృందాలను పర్యవేక్షించాలన్నారు. వ్యాపార సముదాయాలు, బ్యాంకులు, ఏటిఎం కేంద్రాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రార్థనా మందిరాల వద్ద బందోబస్తు లేదా బీట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఫిన్స్ ( ఫింగర్ ప్రింట్స్ ఐడెంటిఫికేషన్ నెట్వర్కింగ్ సిస్టం) సేవలను విరివిగా వినియోగించి నేరస్తుల ఆటకట్టించాలన్నారు. పాత నేరస్తులపై ప్రత్యేక నిఘా కొనసాగించాలన్నారు. ప్రస్తుతం వీరు ఎక్కడ ఉంటున్నారు వారి దైనందిన కార్యకలాపాలపై ఆరా తీయాలన్నారు. నేర ప్రవృత్తి వీడి బుద్ధిగా జీవించేలా కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. సి.సి కెమేరాలు పక్కాగా పని చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా భద్రతలో భాగంగా అవసరమైన వ్యాపార సముదాయాలు, నివాస ప్రాంతాల్లో సి.సి కెమేరాలు ఇన్స్టాల్ చేయించాలన్నారు.
అనుమానాస్పందంగా తిరుగుతున్నా, తచ్చాడుతున్నా వెంటనే డయల్ – 100 లేదా జిల్లా పోలీస్ వాట్సాప్ నంబర్ 9989819191 కు సమాచారం చేరవేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.